భారత్‌లో ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ఆస్తుల విలువ ఎంతంటే

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం దేశంలో రిచెస్ట్ సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తుల నికర విలువ 931 కోట్ల రూపాయలు అని ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది

భారత్‌లోని మొత్తం ముఖ్యమంత్రుల ఆస్తి విలువ రూ.1,600 కోట్ల రూపాయలు కావడం విశేషం.

ఏపీ సీఎం చంద్రబాబు చరాస్తుల విలువ రూ.8,10,42,29,047 (రూ. 8 వందల 10 కోట్ల 42 లక్షలు)

ఏపీ సీఎం చంద్రబాబు స్థిరాస్తుల విలువ రూ.1,21,41,41,609 (నూట ఇరవై ఒకటి కోట్ల 41 లక్షల రూపాయలు)

టీడీపీ అధినేత చంద్రబాబుకు రూ.10 కోట్ల అప్పులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది

చంద్రబాబు 1992లో రూ.7000తో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. 3 దశాబ్దాలలో హెరిటేజ్ 17 రాష్ట్రాల్లో తమ ఉనికి వ్యాప్తి చేసింది.