అన్వేషించండి

First Nature Cure Hospita in AP: రాష్ట్రంలో తొలి నేచర్ క్యూర్ మెడికల్ కాలేజీ - వైజాగ్ కేంద్రంగా వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు

Andhra Pradesh | రాష్ట్రంలో తొలి నేచర్ క్యూర్ వైద్య కళాశాలను వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Nature Cure Hospital In Vizag | విశాఖపట్నం: ఏపీలో ఆయుష్ వైద్య సేవలను మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని ఆరోగ్యశాఖా మంత్రి సత్య కుమార్ (Satya Kumar) అన్నారు. ఆయుర్వేద, హోమియో, యూనాని, ప్రకృతి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా ఆసుపత్రులను కొత్తగా ఏర్పాటుచేసేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే తొలి నేచర్ క్యూర్ వైద్య కళాశాల వైజాగ్ లో రాబోతుంది. ఇందులో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభం కాబోతున్నాయి. విశాఖ, కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. అలాగే... విశాఖ నగరంలోనే ప్రభుత్వ ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగ శాల కూడా రాబోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం.. 2016–17లో నేచర్ క్యూర్ ఆసుపత్రి (ప్రకృతి వైద్య కళాశాల), రెండు ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చూపుతున్న చొరవతో కాకినాడ ఆసుపత్రికి రూ.7.17 కోట్లు, విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రికి రూ.4.18 కోట్లు, నేచర్ క్యూర్ వైద్య కళాశాలకు రూ.4.08 కోట్లు మంజూరయ్యాయని వైద్య శాఖ ప్రకటన రిలీజ్ చేసింది. కేంద్రం నుంచి మూడు సంవత్సరాల తరువాత నిధుల విడుదల అవుతున్నాయనీ దీనివల్ల ఆయుష్ వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు

నేచర్ క్యూర్ వైద్య కళా శాలలో 2026-27 నుంచి ప్రవేశాలు
విశాఖలోని విమ్స్ ప్రాంగణంలో రూ.16.40 కోట్లతో చేపట్టిన నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి బ్యాచులర్ ఆఫ్ నాచురోపతి అండ్ యోగా సైన్సెస్ (బీఎన్వైఎస్) కోర్సులో తరగతులు ప్రారంభంకానున్నాయి. బీఎన్ వైఎస్ కోర్సులో 50 సీట్ల భర్తీకి కేంద్రం ఆమోదం తెలుపనుంది. ఈ కళాశాల పక్కనే.. రూ.14.85 కోట్ల వ్యయంతో 50 పడకలతో చేపట్టిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి నిర్మాణపనులు కూడా పూర్తయ్యేద శలో ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో ఆయుర్వేద, హోమియో, యూనాని వైద్య సేవలు ప్రజలకు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి. వీటి ఆధారంగా కేంద్రం అడ్మిషన్స్ కు అనుమతి ఇస్తుoది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినందున అడ్మిషన్స్ త్వరగా స్టార్ట్ చేయడానికి వెసులుబాటు ఉంది.

నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు
నేచర్ క్యూర్ వైద్య కళాశాల ఏర్పాటుకు తగ్గట్లు ప్రత్యేకంగా నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 50 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. సుమారు రూ.16 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి.

విశాఖలోనే ఆయుర్వేద మందుల తయారీ, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్
విశాఖలోని శొంఠ్యాం ప్రాంతంలో సుమారు రూ.6 కోట్లతో ఆయుర్వేద ఫా€్మసీ, డ్రగ్ టెస్టింగ్ లేబరోరేటరీల భవన నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుమారు రూ.5 కోట్లతో పరికరాలు, యంత్రాలు, ఇతర వాటి కొనుగోళ్ల ప్రక్రియ జరగనుంది.

కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి
కాకినాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 50 పడకలతో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఆయుర్వేద, హోమియో, యూనాని వైద్య సేవలు ఇక్కడ ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన వైద్య పరికరాలు, యంత్రాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. మూడు నెలల్లోగా ఈ ఆసుపత్రి సేవలు ప్రజలకు అందుబాటులోనికి రానున్నాయి.

ధర్మవరం, కాకినాడలో ఆయుర్వేద వైద్య కళా శాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు!

నేషనల్ ఆయుష్ మిషన్ కింద కాకినాడలో ఆయుర్వేద వైద్య కళాశాల, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయుర్వేద వైద్య కళాశాలల ఏర్పాటుఆమోదం కోసం కేంద్ర ఆయుష్ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ వెల్లడించారు. 
ధర్మవరంలో ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా ఉండాల్సిన ఆయుర్వేద ఆసుపత్రిని 50 పడకలతో ఏర్పాటుచేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మంత్రి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget