అన్వేషించండి

GATE 2026 Applications: గేట్ 2026 దరఖాస్తు ప్రక్రియ వాయిదా.. ఎగ్జామ్ తేదీలు, ఫీజు వివరాలివే.. ఈ మార్పు గమనించారా

GATE 2026 Exam Dates | ఐఐటి గౌహతి గేట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేయగా ఆగస్టు 28 నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతున్నాయి. పరీక్ష. ఫీజులు వేర్వేరుగా ఉన్నాయి.

GATE 2026 Registration Process | ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. IIT గౌహతి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) గేట్  అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, ఇతర సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, PhD ప్రోగ్రామ్‌లలో విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ఆగస్టు 28 నుండి గేట్ 2026కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు తుది గడువు సెప్టెంబర్ 28, 2025 అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. లేట్ ఫీజుతో అక్టోబర్ 9వరకు గేట్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తొలుత తెలిపిన షెడ్యూల్ ప్రకారమైతే నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ మూడు రోజులపాటు ప్రక్రియ వాయిదా పడింది.

గేట్ 2026 ఎగ్జామ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15  తేదీలలో నిర్వహించనున్నారు. గేట్ ఎగ్జామ్ రెండు షిఫ్ట్‌లలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు 2 జనవరి 2026 నుండి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 19 నుండి గేట్ స్కోర్‌కార్డ్‌లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. గేట్ స్కోర్‌ వచ్చిన తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.

కొత్త పేపర్ చేర్చారని తెలుసా

ఈసారి గేట్ 2026 పరీక్షలో ఒక ప్రత్యేక మార్పు చేశారు. ఇంజనీరింగ్ సైన్స్ (XE) కింద ఎనర్జీ సైన్స్ అనే కొత్త పేపర్‌ చేరింది. అయితే మొత్తం ఎగ్జామ్ పేపర్ల సంఖ్య 30 గానే ఉంటుంది. పరీక్ష స్వరూపం గతంలోలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) గా నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి

గేట్ 2026లో దరఖాస్తు రుసుము అభ్యర్థుల కేటగిరీని బట్టి వేర్వేరుగా ఉంటుంది. మహిళా అభ్యర్థులతో పాటు SC, STలు, దివ్యాంగుల కోసం సాధారణ వ్యవధిలో అప్లికేషన్ ఫీజు ₹1000, లేట్ ఫీజు పొడిగించిన వ్యవధిలో ₹1500 ఉంటుంది. ఇతర కేటగిరీలైన జనరల్, ఓబీసీ అభ్యర్థులందరికీ సాధారణ వ్యవధిలో ₹2000 అప్లికేషన్ ఫీజు.. పొడిగించిన తేదీల వ్యవధిలో ₹2500 గా నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజును అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI వంటి ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే చెల్లించవచ్చు.

GATE 2026కు ఎలా దరఖాస్తు చేయాలి?

  • అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ని సందర్శించండి. 
  • తరువాత "రిజిస్ట్రేషన్" పై క్లిక్ చేసి, మీ పేరు, ఇమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి
  • తరువాత, రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ లభిస్తుంది.
  • ఇప్పుడు లాగిన్ చేసి అప్లికేషన్ ఫాంను తెరిచి, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, విద్యార్హతలు లాంటి మీ వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి. పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాలి.
  • అనంతరం మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలను (Caste సర్టిఫికేట్ లేదా దివ్యాంగ సర్టిఫికేట్ వంటివి) అప్‌లోడ్ చేయండి.
  • ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా క్రిడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
  • అన్ని వివరాలను చెక్ చేసుకున్నాక దరఖాస్తు ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.



About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget