Cyclone Asani Effect: అసని తుపాను ఎఫెక్ట్, తీరానికి కొట్టుకొచ్చిన మందిరం - చూసేందుకు ఎగబడుతున్న జనాలు !

Temple Flown at Sunnapalli: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. అసని తుపాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. 

FOLLOW US: 

Cyclone Asani Chariot at Sunnapalli: అసని తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్లు, సంబంధిత జిల్లాల మంత్రులు తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కలగకూడదని, తీరం దాటిన తరువాత బాధితులకు సరైన ఆహారం, నీళ్లు అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. అసని తుపాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. 

తీరానికి తరలివస్తున్న స్థానికులు 
తీరం వైపునకు మందిరం (రథం) కొట్టుకురావడంతో ఇది గమనించిన స్థానికులు మొదట్లో ఆందోళనకు గురయ్యారు. సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి తీరానికి దాదాపు చేరుకున్న తరువాత మందిరం లాంటి రథాన్ని స్థానికులు తాళ్లతో లాగుతూ ఒడ్డుకు తీసుకొచ్చారు. వింత రథం విషయం తెలియగానే స్థానికులు వీక్షించేందుకు భారీ సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. తీవ్రరూపం దాల్చిన తుపాను (Cyclone Asani Effect) ప్రభావంతో బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావడంతో స్థానికులకు వింత అనుభూతి కలిగింది.

ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందో ? 
ఆ రథం మలేషియా, థాయిలాండ్ లేక జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు భావిస్తున్నారు. గతంలో తిత్లీ లాంటి పెద్ద తుపానులు సంభవించినప్పుడు సైతం ఇలాంటివిచిత్రమైన వస్తువులు, రథాలు తాము చూడలేదని స్థానికులు చెబుతున్నారు. తమ తీరానికి స్వర్ణ మందిరం కొట్టుకు వచ్చిందంటూ కొందరు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు అక్కడికి చేరుకుని రథాన్ని పరిశీలించారు. అది ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది.

కాకినాడ, విశాఖపట్నం తీరానికి అసని తుపాను.. 
అసని తుపాను వాయువ్య దిశగా కదులుతూ మే 11 ఉదయానికి కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా రానుందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రంలో అలజడి అధికం కావడంతో మే 12వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చిరించింది. అనంతరం బలహీనపడి దిశ మార్చుకుని ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్లే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో తుపాను బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

Also Read: Cyclone Asani Effect: రేపు తీరం దాటనున్న అసని తుపాను, అలర్ట్ అయిన కోస్తాంధ్ర - విశాఖలో మోహరించిన నేవీ, ఇతర రెస్క్యూ టీమ్స్

Also Read: Cyclone Asani Effect: అసనీ తుపానుతో ఏపీలో భారీ వర్షాలు - ఆ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Published at : 10 May 2022 08:42 PM (IST) Tags: Srikakulam Chariot Chariot at Sunnapalli Coast Ratham Santhabommali

సంబంధిత కథనాలు

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్‌

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా  వైసీపీ స్కెచ్‌

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్

Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్