Cyclone Asani Effect: అసనీ తుపానుతో ఏపీలో భారీ వర్షాలు - ఆ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Rains In AP Due To Cyclone Asani: అసనీ తుపాను ప్రభావం అధికం కావడంతో ఏపీలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని కోస్తాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Cyclone Asani Effect: అసనీ తుపాను తీవ్రరూపం దాల్చడంతో ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీర ప్రాంతాలు ఖాళీ చెయ్యాలని హెచ్చరిక జారీ చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సైతం రేపటి వరకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అసనీ తుపాను (Cyclone Asani) ప్రభావం నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో వర్షాలు..
అసనీ తుపాను కాకినాడకు ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో మే 12 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు తీరంర వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు మరో రెండు రోజుల వరకు వేటకు ప్రమాదకరమని హ హెచ్చరించారు.
District forecast of Andhra Pradesh dated 10.05.2022 pic.twitter.com/w3O0JEMDoA
— MC Amaravati (@AmaravatiMc) May 10, 2022
కాకినాడతో పాటు కొనసీమ జిల్లాలో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోస్తా తీర ప్రాంతాలు నర్సాపురం నుంచి మచిలీపట్నం దాక ఈదురు గాలులు గంటకు 60 కి.మీ. వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపున కావలి - ఒంగోలు మధ్యలో మోస్తరు వర్షాలతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది.
7 Day midday forecast of Andhra Pradesh dated 10.05.2022 pic.twitter.com/eQRsnka6cg
— MC Amaravati (@AmaravatiMc) May 10, 2022
విశాఖపట్నం నగరంతో పాటుగా నగరానికి దగ్గరగా ఉన్న అనకాపల్లి, సబ్బవరం, స్టీల్ ప్లాంటులో కాసేపట్లో భారీ వర్షాలు పడనున్నాయి. అటునుంచి నర్సీపట్నం వైపు తుపాను ప్రభావం చూపుతుంది. తీవ్ర తుఫాను బంగాళాఖాతంలో మచిలీపట్నానికి 200 kms కి.మీ. దూరంలో కొనసాగుతోందని ఏపీ వెదర్ మ్యాన్ కొన్ని గంటల కింద తెలిపారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో,విశాఖ, విజయనగరం, అనకాపల్లి పాడేరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి.
24 గంటల్లో బలహీనపడనున్న అసనీ తుపాను
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశాలపై సైతం అసనీ తుపాను ప్రభావం ఉంది. మే 12 వరకు ఈ రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్యంగా కదులుతూ మరో 24 గంటల్లో తుపాను పూర్తిగా బలహీనపడుతుంది. ఆ సమయంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read: Asani Cyclone Effect: అసని ధాటికి వణికిపోతున్న ఆంధ్రా తీరం- శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గాలి వాన