Botsa On Narayana Arrest: తప్పు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు, అందుకే అరెస్ట్ చేశారు - నారాయణ అరెస్టుపై మంత్రి బొత్స
విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే పేపర్ల లీకేజీ కేసులో హస్తం ఉన్న అందర్నీ అరెస్ట్ చేస్తారని, విచారణలో భాగంగా ఏపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంత్రి బొత్స చెప్పారు.
AP Minister Botsa Satyanarayana Responds over Ex Minister Narayana Arrested In 10th Paper leakage case
టెన్త్ క్లాస్ పేపర్ల మాల్ ప్రాక్టీస్, లీకేజీ కేసులో విచారణ జరుగుతోందని, ఎక్కడ నుంచి లీకయ్యాయో అక్కడే అధికారులు విచారణ చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే పేపర్ల లీకేజీ కేసులో హస్తం ఉన్న అందర్నీ అరెస్ట్ చేస్తారని, చట్టం తన పని తాను చేసుకునిపోతుందని చెప్పారు. టెన్త్ పేపర్ల లీకేజీ కేసులో విచారణలో భాగంగా ఏపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నారాయణ నిరూపించుకోవాలన్నారు. టెన్త్ పేపర్ల లీకేజీలో ప్రమేయం లేకపోతే పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో పేపర్ల లీకేజీతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల టెన్త్ పరీక్షల పేపర్లు లీకేజీలు కలకలం రేపాయి. ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు 60 మంది వరకు అరెస్ట్ చేశారని మంత్రి బొత్స తెలిపారు. అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని గుర్తించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు టెన్త్ పేపర్ల లీకేజీపై ముమ్మరంగా దర్యాప్టు చేపట్టారని, ఇందులో ప్రమేయం ఉన్న అందర్నీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తామన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్‌లో అక్రమాలు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌లో అక్రమాలు జరగకపోతే పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు వాస్తవాలు తెలుసుకుని త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతం పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అయ్యారని తెలిపారు. టెన్త్ పేపర్ లీక్ స్కామ్‌లో ఎవరున్నా అరెస్టులు తప్పవన్నారు. రాజకీయంగా అనేక విమర్శలు వస్తాయని తెలుసు, కానీ పోలీసులు, దర్యాప్తు సంస్థలు త్వరలోనే బాధ్యతుల వివరాలను వెల్లడిస్తాయన్నారు.
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..
చిత్తూరులోని నారాయణ స్కూల్స్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం ఏపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నారాయణ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని, ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో మే 10న ఉదయం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మాజీ మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి రమాదేవిని అదుపులోకి తీసుకొని ఏపీలోని చిత్తూరుకు వారి వాహనంలోనే తరలిస్తున్నారు.
Also Read: Cases On Chandrababu : ఏ-1 చంద్రబాబు, ఏ-2 నారాయణ - మళ్లీ రాజధాని భూముల కేసుల్లో సీఐడీ అరెస్టులు !
Also Read: Narayana Arrest: మాజీ మంత్రి నారాయణను ఏపీకి తరలిస్తుండగా ట్విస్ట్! తక్షణం స్పందించిన ఫ్యామిలీ