అన్వేషించండి

Amaravati Cases On Chandrababu Narayana : ఏ-1 చంద్రబాబు, ఏ-2 నారాయణ - మళ్లీ రాజధాని భూముల కేసుల్లో సీఐడీ అరెస్టులు !

చంద్రబాబు, నారాయణపై రాజధాని ల్యాండ్ పూలింగ్ కేసులు నమోదయ్యాయి. ఏ-1 గా చంద్రబాబు.. ఏ -2గా నారాయణ పేరు ఉంది. మరో పదహారు మంది పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి.

 

ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు, నారాయణలపై అమరావతి భూముల విషయంలో మరోసారి కేసులు నమోదు చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాలు అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఏప్రిల్ 4 వ తేదీన మంగళగిరి సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.  దీనిపై ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. మే 6వ తేదీ ప్రాథమిక నివేదిక సిద్దం చేశారు. మే 9 వ తేదీన కేసు నమోదు చేశారు. మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చి ఎఫ్ ఐఆర్  నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, మజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని రమేష్, ప్రభుత్వ అధికారులు నిందితులుగా పేర్కొన్నారు. 


Amaravati Cases On Chandrababu Narayana : ఏ-1 చంద్రబాబు, ఏ-2 నారాయణ - మళ్లీ రాజధాని భూముల కేసుల్లో సీఐడీ అరెస్టులు !

 

రాజధాని ల్యాండ్ పూలింగ్‌పై నమోదు చేసిన కేసుల్లో చంద్రబాబు, నారాయణతో పాటు మొత్తం పధ్నాలుగు పేర్లు ఉన్నాయి. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు, అధికారులు అనే పేరుతో పధ్నాలుగో కాలమ్ ఉంచారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన దాని ప్రకారం రాజధానికి భూములిచ్చిన  రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే ఫిర్యాదు చేశారు. ల్యాండ్ పూలింగ్ కేసులు గతంలోనే తేలిపోయాయి కాబట్టి ఈ సారి కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో మార్పుచేర్పులు చేశారని దీని వల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని.. ఇతరులు లబ్ది పొందారని ఆయన ఫిర్యాదు చేశారు.   గతంలో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ..  ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరుడు జూపూడి జాన్సన్ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది లేదని సుప్రీంకోర్టు తేల్చింది. 

Amaravati Cases On Chandrababu Narayana : ఏ-1 చంద్రబాబు, ఏ-2 నారాయణ - మళ్లీ రాజధాని భూముల కేసుల్లో సీఐడీ అరెస్టులు !

 

రాజధాని భూముల్లో భారీ అక్రమాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఎలాంటి అవినీతి నిరూపించలేకపోయారు. పైగా అమరావతికి భూముల్చిచన ముఫ్పై వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా అక్రమాలు జరిగాయని పిర్యాదు చేయలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుడు జూపూడి జాన్సన్ పేరుతో గతంలో ఫిర్యాదులు చేయడంతో... అమరావతి ప్రాంతంలో భూములు ఉన్న అనేక మందిపై కేసులు నమోదు చేశారు. అయితే సుప్రీంకోర్టు  ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది లేదని తేల్చి చెప్పింది. ఈ సారి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాల పేరుతో కేసులు పెట్టి అరెస్టులు ప్రారంభించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

AP Economic Regions: ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
Nara Lokesh On Raptadu Girl Health: రాప్తాడు బాలిక ఒక ఫైటర్.. మళ్లీ నవ్వుతోంది, నడుస్తోంది.. పూర్తి బాధ్యత తనదంటూ మంత్రి లోకేశ్ భరోసా
రాప్తాడు బాలిక ఒక ఫైటర్.. మళ్లీ నవ్వుతోంది, నడుస్తోంది.. పూర్తి బాధ్యత తనదంటూ మంత్రి లోకేశ్ భరోసా
ABP Southern Rising Summit 2026:హైదరాబాద్‌లో రేపే సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
హైదరాబాద్‌లో రేపే సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
Janasena Rukmini Kota: జాబ్ ఫ్రాడ్‌పై ఫిర్యాదు చేసిందే నేను.. పవన్ కల్యాణ్ పేరు ఎందుకు లాగుతున్నారు?- కోట రుక్మిణి లేఖ!
జాబ్ ఫ్రాడ్‌పై ఫిర్యాదు చేసిందే నేను.. పవన్ కల్యాణ్ పేరు ఎందుకు లాగుతున్నారు?- కోట రుక్మిణి లేఖ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget