అన్వేషించండి

Fact Check On Amaravati Cost: అమరావతి నిర్మాణ ఖర్చుపై పొలిటికల్ హీట్.. వైఎస్ జగన్ విమర్శలకు ఫ్యాక్ట్‌చెక్ కౌంటర్

Fact Check On Amaravati Cost: అమరావతి నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి దోచుకుంటున్నారని ఏపీ ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శించారు. ఈ విమర్శలకు ఫ్యాక్ట్ చెక్ లెక్కలతో కౌంటర్ ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.


Fact Check On Amaravati Cost: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, హెచ్ఓడీ భవనాల ఖర్చుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.29,340 ఖర్చు చేస్తున్నారని జగన్‌ చేసిన విమర్శలపై కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.17,339 మాత్రమే ఖర్చవుతోందని ఫ్యాక్ట్‌చెక్ ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచింది.

వైఎస్ జగన్‌ ఆరోపణలు 

సీఎం చంద్రబాబును ఉద్దేశించి శనివారం ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. "మీ కలెక్షన్‌ రేటు, కరప్షన్‌ రేటు అదిరిందయ్యా" అంటూ పోస్ట్ పెట్టారు. అంచనాలను భారీగా పెంచేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. 2018లో కొత్త సచివాలయ నిర్మాణానికి వేసిన అంచనా వ్యయం రూ.2,271 కోట్లు మాత్రమేనని జగన్‌ గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని అమాంతం పెంచేసి 52.20 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలకు రూ.15,317 కోట్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఫైవ్‌స్టార్ సదుపాయాలతో నిర్మించే భవనాలకు కూడా చదరపు అడుగుకు రూ.5 వేలు మించడం లేదని, కానీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే భవనాలకు ఇంత భారీగా ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ కౌంటర్ 

వైఎస్ జగన్‌ చేసిన విమర్శలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత మీడియా ద్వారా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ పూర్తి వివరాలను ప్రకటించింది.  అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్లను మొత్తం 71.43 లక్షల చదరపు అడుగులలో నిర్మిస్తుంటే, వైఎస్ జగన్‌ ఆ విస్తీర్ణాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. విస్తీర్ణాన్ని తగ్గించి, ఎస్‌ఎఫ్‌టీ ధరను పెంచి చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.

వాస్తవ విస్తీర్ణం ప్రకారం లెక్కగడితే అమరావతి భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.17,339 ఖర్చు మాత్రమే అని స్పష్టం చేసింది. జాతీయ, ప్రాంతీయ ప్రాజెక్టులతో పోల్చి చూసినా ఈ వ్యయం అత్యంత తక్కువని తెలిపింది. ఉదాహరణకు, నాలుగు అంతస్తులతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనానికి చదరపు అడుగుకు రూ.16,916 ఖర్చయిందని ప్రభుత్వం గుర్తు చేసింది.

Also Read: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం

రుషికొండ ప్యాలెస్‌ ఖర్చు 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలను  అనుమతించాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే వైఎస్ జగన్‌ అమరావతిపై తప్పుడు ప్రచారానికి తెరలేపారని ప్రభుత్వం విమర్శించింది. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణానికి జగన్‌ చదరపు అడుగుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేశారని తెలిపింది. పైగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రూ.200 కోట్ల జరిమానా చెల్లించి రాష్ట్ర ఖజానాకు భారీ చిల్లు పెట్టారని ప్రభుత్వం విమర్శించింది. మూడు నెలలకోసారి అమరావతి నిర్మాణ వ్యయంపై వైఎస్ జగన్‌ ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  

Also Read: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం

Frequently Asked Questions

అమరావతి నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం ఏ ప్రాజెక్టులతో పోల్చింది?

ప్రభుత్వం అమరావతి వ్యయం జాతీయ, ప్రాంతీయ ప్రాజెక్టులతో పోలిస్తే తక్కువని తెలిపింది. కొత్త పార్లమెంటు భవనానికి చదరపు అడుగుకు రూ.16,916 ఖర్చయిందని ఉదాహరణగా పేర్కొంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Panchayat Elections Live Updates: ఏపీలో రెండోదశ గ్రామ పంచాయతీ పోలింగ్.. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
ఏపీలో రెండోదశ గ్రామ పంచాయతీ పోలింగ్.. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?
E20 పెట్రోల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 నిజమైన మైలేజ్‌ ఇదే.. ఆన్‌రోడ్‌ ధర ఎంతంటే?
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Embed widget