నరసాపురం - తిరుపతి మధ్య కొత్తగా 17428/17427 నరసాపురం - తిరుపతి ఎక్స్ ప్రెస్ ప్రారంభమైంది. ఈ రైలు ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నరసాపురం -తిరుపతి మధ్య ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. దీంతోపాటు వైజాగ్- సికింద్రాబాద్ వందేభారత్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేశారు.

- నరసాపురం-తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం.
- ప్రయాణికుల డిమాండ్ మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
- విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ కు తాడేపల్లిగూడెంలో ఆగే అవకాశం.
ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని రైల్వే చాలా కొత్త రైళ్లను ఎనౌన్స్ చేస్తోంది. అలాగే ఆల్రెడీ తిరుగుతున్న స్పెషల్ రైళ్లను కూడా రెగ్యులర్ ట్రెన్స్‌గా మారుస్తోంది. అందులో భాగంగా నరసాపురం తిరుపతి మధ్య కొత్త రెగ్యులర్ ఎక్స్ప్రెస్‌ను అనౌన్స్ చేసింది దక్షిణ మధ్య రైల్వే.
ట్రైన్ నెం 17428/17427 నరసాపురం -తిరుపతి -నరసాపురం ఎక్స్ ప్రెస్
రైలు నెంబర్ 17428 ఎక్స్‌ప్రెస్ ఇకపై ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3:50కి నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మంగళవారం తెల్లవారుజాము 3:40కి తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 27 నుంచి ప్రతి సోమవారం నరసాపురం నుంచి అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో 17427 నెంబర్ గల ఎక్స్ ప్రెస్ ప్రతీ ఆదివారం రాత్రి 10:10కి తిరుపతిలో బయలుదేరి సోమవారం ఉదయం 09:30కి నరసాపురం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మే 3 తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ లో 2AC, 3AC, స్లీపర్, జెనరల్ కోచెస్ ఉంటాయని రైల్వే తెలిపింది.
విశాఖపట్నం -సికింద్రాబాద్ వందే భారత్ కు తాడేపల్లి గూడెం లో హాల్ట్?
మరోవైపు విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తాడేపల్లిగూడెం స్టేషన్లో హాల్ట్ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం గోదావరి జిల్లాల్లో అతి ముఖ్యమైన మార్కెట్ ప్రాంతమైన తాడేపల్లిగూడెం స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌కు స్టాప్ కల్పించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 10 -15 రోజుల్లోనే సాంకేతిక సమస్యలను అధిగమించి వైజాగ్- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు తాడేపల్లిగూడెం స్టేషన్ లో హాల్ట్ కల్పిస్తారని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
Frequently Asked Questions
నరసాపురం - తిరుపతి మధ్య కొత్తగా ఏ రైలు ప్రారంభమైంది?
నరసాపురం - తిరుపతి ఎక్స్ ప్రెస్ ఏ రోజులలో నడుస్తుంది?
రైలు నెంబర్ 17428 నరసాపురం నుంచి ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3:50కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 17427 తిరుపతి నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 10:10కి బయలుదేరుతుంది.
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇస్తారా?
అవును, విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తాడేపల్లిగూడెం స్టేషన్ లో హాల్ట్ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు 10-15 రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















