Vizag Food Festival: నేటి నుంచి వైజాగ్‌లో మూడు రోజుల పాటు ఫుడ్ ఫెస్టివల్
Vizag Food Festival: నేటి నుంచి వైజాగ్ లో మూడు రోజుల పాటు ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. 40 స్టాళ్లతో నేషనల్ ఇంటర్ నేషనల్ ఫుడ్ ఐటమ్స్ ఆకట్టుకోనున్నాయి.

Vizag Food Festival: వైజాగ్ లో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. బీచ్ రోడ్లోని ఎంజీఎం మైదానంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఎల్లుండి వైజాగ్ బీచ్ లో వంటల వేడుక జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
40 ఫుడ్ స్టాళ్లు.. భోజన ప్రియులకు పండుగే...!
వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్లో ఈ సారి ప్రముఖ స్టార్ హోటళ్లు భాగస్వామ్యం అవుతున్నాయని, 40 వరకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లా అధికారులు. ప్రామాణికమైన ఆంధ్రా రుచులు, ప్రపంచ వంటకాలు, సిగ్నేచర్ వంటకాల మిశ్రమాలతో కూడిన రకరకాల వంటకాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయన్నారు. బోలెడన్ని నేషనల్, ఇంటర్ నేషనల్ వంటకాలు, గోదావరి రుచులతో కూడిన ప్రత్యేకమైన భోజనాలు, ఆర్గానిక్ వంటకాలకు సంబంధించిన స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తునన్నారు ఇక్కడ. మూడు రోజులూ ప్రతీ సాయంత్రం 6.00 నుంచి 10.00 గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని, ఫుడ్ తో పాటు బోలెడన్ని సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. తొలి రోజు సాయంత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా ఈ ఫుడ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమవుతుంది.
ప్రవేశం ఉచితం
వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ కు ప్రవేశం ఉచితమని, మూడు రోజుల పాటు జరిగే ఈ వంటకాల వేడుకల్లో వైజాగ్ వాసులతో పాటు టూరిస్టులు అందరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని వైజాగ్ కలెక్టర్ తెలిపారు.
వైజాగ్ టూరిజం కు పెద్ద పీట
టూరిజం పరంగా విశాఖపట్నాన్ని మరింత గా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రతిష్టాత్మక స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా రెడీ చేశారు. రేపో మాపో ప్రారంభించనున్నారు. మరోవైపున ఫుడ్ ఫెస్టివల్ అనీ కల్చరల్ ఫెస్టివల్ అనీ రకరకాల సంబరాలు ఎక్స్పోలు వైజాగ్ లో వరుస పెట్టి జరుగుతున్నాయి. ఈ మధ్యనే హెలికాప్టర్ మ్యూజియం, డబుల్ డెకర్ బస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓవరాల్ గా టూరిజం పరంగా వైజాగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావాలని వైజాగ్ వాసులు బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి జరిగే మూడు రోజుల వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ సూపర్ సక్సెస్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.





















