Vizag RK Beach: విశాఖ ఆర్కే బీచ్ లో ముందుకొచ్చిన సముద్రం... 200 మీటర్ల మేర కోతకు గురైన బీచ్... పర్యాటకులకు నో ఎంట్రీ
జవాద్ తుపాను ప్రభావంలో విశాఖలో సముద్రం కొంత మేర ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్ లోని చిల్డ్రన్ పార్కు ప్రహరీ గోడ దెబ్బతింది. అలాగే పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు వచ్చాయి.
విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం కొంత మేర ముందుకొచ్చింది. దీంతో బీచ్ లోని చిల్డ్రన్ పార్కు 10 అడుగుల మేర కోతకు గురై దెబ్బతింది. ఈ పార్కులో ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. పార్కులోని బల్లలు ధ్వంసమయ్యాయి. సముద్రం ముందుకు రావడంతో బీచ్ లో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు వచ్చాయి. దీంతో ఆర్కే బీచ్‌లో పర్యాటకులను అనుమతించడంలేదు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. నోవాటెల్ హోటల్ దగ్గర బారికేడ్లు పెట్టారు. జవాద్ తుపాను ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చి భూమి కోతకు గురైంది.
Also Read: జిల్లాపై చంద్రబాబు ఫోకస్.. టీడీపీ నేతల పనితీరుపై అధినేత ఆగ్రహం.. లెక్కలు తేల్చేందుకు రెడీ!
ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు
ఏపీకి జవాద్ తుపాను ముప్పుతప్పింది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరంవైపు వస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తాజాగా సముద్రంలోనే జవాద్ తుపాను బలహీనపడిందని పేర్కొంది. దీని వల్ల ఏపీకి పెద్దగా నష్టమేమి లేదని ఐఎండీ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు తెలిపింది. తుపాను ఉత్తర-ఈశాన్య దిశలో కదిలి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..
మరింత బలహీన పడి అల్పపీడనం మారే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశా కదులుతోందని ఐఎండీ ప్రకటించింది. గడచిన 6 గంటలుగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని వెల్లడించింది. ఈ వాయుగుండం విశాఖకు ఈశాన్యంగా 230 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 90 కిలోమీటర్ల, పూరీకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. పూరీకి దగ్గరగా వాయుగుండం వెళ్తోందని సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. రాగల 12 గంటల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనంగా కొనసాగుతుందని వాతావరణశాఖ ప్రకటించింది.
Also Read: భువనేశ్వరి కాళ్లు కన్నీటితో కడుగుతాం.. గౌరవసభలు విరమించుకోవాలన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !