Anantapur జిల్లాపై చంద్రబాబు ఫోకస్.. టీడీపీ నేతల పనితీరుపై అధినేత ఆగ్రహం.. లెక్కలు తేల్చేందుకు రెడీ!
అనంతపురం జిల్లా టిడిపి నేతల వైపల్యాలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.పెనుకొండ లాంటి కంచుకోటలో ఈ పరిస్థితి వచ్చిందంటే మీలో ఎప్పుడూ మార్పువస్తుందంటూ నేతలను చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
పార్టీకి కంచుకోటగా ఉండే జిల్లాలో వరుస వైపల్యాలపై జిల్లా నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. కలిసికట్టుగా, వ్యూహాత్మకంగా వెల్లాల్సిన చోట విభేదాలతో పార్టీని ఓటముల బాట పట్టించారని వ్యాఖ్యానించారు. అదికార పార్టీ ఆగడాలకు తట్టుకోలేకపోతున్న సమయంలో మనకు వచ్చిన ప్రతి ఎన్నికలను, ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాల్సిన చోట విభేదాలతో, వ్యూహాలు రచించడంలో విపలం అయ్యారు అంటూ పెనుకొండ మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెనుకొండ టీడీపీకి కంచుకోట. అలాంటి చోట కూడా గెలవడానికి ఇంత ఇబ్బందులు పడితే ఎలా అంటూ మండిపడ్డారు. చిన్న మున్సిపాలిటిలో జరిగిన ఎన్నికల్లో ఇంత వైఫల్యం అయితే అందుకు గల కారణాలు ఏంటి అంటూ నేతలను నిలదీశారు. ముఖ్యంగా చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడంతోనే నాలుగు స్థానాలను కోల్పోవడానికి కారణం అయ్యిందన్నారు. బలమైన మహిళా నేత సవితమ్మను విస్మరించడమే కాకుండా, నియోజకవర్గానికి వచ్చిన నేతలు కూడా ఏదో తూతూమంత్రంగా ప్రచారం చేశారు.. తప్పితే అనుభవం వున్న నేతలు ఎలక్షన్ చేస్తే ఏవిదంగా వుంటుందో అలా చేయలకపోయారన్నారు.
అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జిల్లా నేతల్లో కలవరం పుట్టించాయి. క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలు తన వద్దకు వస్తున్నాయని, రానున్న రోజుల్లో మార్పులకు సిద్దంగా వుండాలంటూ నేతలను అప్రమత్తం చేశారు. సీనియర్ నేతలంతా తమకు పార్టీలో ఎదురులేనట్లు భావిస్తూ ద్వితీయ శ్రేణి నేతలను తొక్కేస్తున్నారని, ఆ విషయాలు త్వరలోనే తేల్చుతాను అంటూ చంద్రబాబు నేతలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా నేతల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కుప్పం, పెనుకొండలలో ఓటమిని టీడీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: YSRCP MLA : భువనేశ్వరి కాళ్లు కన్నీటితో కడుగుతాం.. గౌరవసభలు విరమించుకోవాలన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !
పరిటాల రవీంద్ర ఎన్నిక తరువాత నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం పెనుకొండ. అలాంటి నియోజకవర్గాన్ని ఇంత దారుణంగా తయారు చేయడంపై అధినేత గుర్రుగా ఉన్నట్లు సమాచారం.అయితే నేతలు మాత్రం ఇంకా సీరియస్ గా తీసుకోవడం లేదని, భ్రమలు వీడి వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు పలికారు. ఇప్పటికి కూడా మెజార్టీ నేతలంతా గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకే ఇంఛార్జ్ ఇవ్వగా.. నియోజకవర్గాల్లో వారిదే పైచేయిగా పెత్తనం చేయిస్తున్నారని, ఇలా అయితే పార్టీ మళ్ళీ గాడిన పడే పరస్థితి లేదన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై సీరియస్ అయినట్లు సమాచారం.
ఇకనుంచైనా ఫోకస్ పెట్టాలని, లేకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు కార్యకర్తలు. వీటిని ఉద్దేశించి చంద్రబాబు త్వరలోనే కీలక నేతలతో మాట్లాడుతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాయలసీమలో ఒక్క అనంతపురంలోనే పార్టీ బలంగా వుండేది. అలాంటి చోట్ల కూడా పార్టీకి వెన్నెముకగా వున్న బీసీలను విస్మరించడం, కేవలం ఒకరిద్దిరి నేతలతోనే జిల్లా కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ బలహీనపడటానికి కారణాలుగా అధినేతకు నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. వీటన్నిటని యువనేత నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వివరించారు. మరి రానున్న రోజులల్లో భారీ మార్పులు జరిగితేనే జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని.. లేకపోతే షరామామూలే అని ద్వితియ శ్రేణి నేతలు వాపోతున్నారు.
Also Read: AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 186 కరోనా కేసులు, ముగ్గురు మృతి... తెలంగాణలో 213 కేసులు