News
News
X

Visakha YCP Leaders: విశాఖను రాజధాని చేసేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం- ఉత్తరాంధ్ర నాయకులు

Visakha YCP Leaders: మళ్లీ నష్టపోవడానికి ఉత్తరాంధ్ర వాసులు సిద్ధంగా లేరని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో మౌనంగా ఉండి నష్టపోయామని, ఉత్తరాంధ్ర ప్రజలంతా మేల్కోవాల్సిందేనన్నారు.

FOLLOW US: 
 

Visakha YCP Leaders: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన అధికార వికేంద్రీకరణను ఉత్తరాంధ్ర ప్రజలు ముక్త కంఠంతో స్వాగతించారని అన్నారు ఉత్తరాంధ్ర  వైసిపీ నేతలు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా తామంతా సిద్ధంగా ఉన్నామని ఉత్తరాంధ్రకు చెందిన మేధావులు, ఉద్యోగులు, రచయితలు, కార్మిక సంఘాల నేతలు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక గాదిరాజు ప్యాలస్ లో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద సంఖ్యలో  ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి అభివృద్ధి ఫలాలు అందాలన్నది ఆయన ఆకాంక్ష అని అన్నారు. 

26 జిల్లాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా..

చంద్రబాబు మాదిరి వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా, మేధావులతో చర్చించి మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలోని 29 గ్రామాలకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదని... 26 జిల్లాల అభివృద్ధి ఆయన లక్ష్యమని అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని పరిశీలించారని, అక్కడ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును అధికారులతో అంచనా వేయిస్తే 1,09,000 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తేలిందని బొత్స వివరించారు. మూడు రాజధానులు ఏర్పాటుకు అయ్యే ఖర్చు కన్నా, అమరావతిలో రాజధాని నిర్మిస్తే మూడు వందల రెట్లు అధికంగా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.  ఇంత సంపద వృథా చేయడం వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. అయితే రాజధాని కోసం అక్కడి రైతులు భూములు ఇచ్చిన మాట వాస్తవమేనని.. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులకు కౌలు ఇస్తోందని అన్నారు. 

చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశాడా..!

News Reels

రైతుల విషయంలో అప్పటి ప్రభుత్వం చేసిన ఒప్పందాలకు తమ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 29 గ్రామాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వారి ఎజెండాను 26  జిల్లాల ప్రజలకు ముడిపెట్టి యాత్ర చేయడం సరికాదని బొత్స అన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన వెనుక ఉన్న వ్యక్తుల కోసం ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటా మంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మూడు రాజధానులు వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పాలని అమరావతి రైతులను మంత్రి ప్రశ్నించారు. అమరావతి రైతులతో చంద్రబాబునాయుడు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అక్కడ రాజధాని నిర్మిస్తానని అగ్రిమెంట్లో రాసాడా? అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు అక్కడి రైతులతో లాలూచీపడి తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మరింత వెనుకబాటుతనానికి గురయ్యారని ఆయన అన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఒక్క మంచి పనైనా చేశాడా అని ఆయన ప్రశ్నించారు.

నష్టనివారణకు ఇప్పటికైనా గళమెత్తాలి..

రాష్ట్ర విభజన సమయంలో  సమతుల్యత పాటించకపోవడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని,  పూర్తిగా మోసపోయే వరకు ఇక్కడ ప్రజలు తెలుసుకోలేక పోయారని చెప్పారు. అప్పుడే తమ గళం విప్పితే బాగుండేదని మంత్రి బొత్స అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కీడు తలపెడుతున్న చంద్రబాబు నాయుడు చర్యల పట్ల మాట్లాడకుండా ఉండి, మరోసారి నష్టపోవడానికి తాము సిద్ధంగా లేమని బొత్స స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి బొత్స ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా మేల్కొని, నష్ట నివారణకు గళమెత్తాలని అని ఆయన పిలుపునిచ్చారు. జనం రోడ్ల మీదికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. సంఘటితంగా, శాంతియుతంగా చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని ఏర్పాటు వలన జగన్ మోహన్ రెడ్డి ఎవరి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేయటం లేదని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ మేలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

ప్రాంతాల మధ్య విద్వేషఆలు సృష్టించొద్దు..

మూడు రాజధానులు సాధన కోసం ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక నేతలను మంత్రి మంత్రి బొత్స కోరారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి వీధివీధిన తిరగాలని ఆయన సూచించారు. పత్రికా, మీడియా యాజమాన్యాలు కొంతమంది వ్యక్తుల కోసం, కాకుండా సమాజ హితం కోసం పని చేయాలని, మూడు రాజధానులు ఏర్పాటు విషయంలో ఈ ప్రాంత ప్రజలు నష్టపోతే, మీరు కూడా నష్టపోక తప్పదని బొత్స అన్నారు. మీ వ్యాపారాలు మీరు సరిగా చేసుకోండి.. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించకండి అని బొత్స హితవు పలికారు. 

పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ.. రాజకీయ ఎజెండాతో సాగుతున్న యాత్ర రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదని అన్నారు. దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని, రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజల మనోభావాలను మన్నించి యాత్ర విరమించుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని, సంక్షేమం, అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టని చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ యాత్ర చేయిస్తున్నాడని ఆయన విమర్శించారు.  ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడు కుట్రలను గమనిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని హంగులు వున్న విశాఖ నగరాన్ని పాలనా రాజధానిగా చేస్తే, వచ్చే నష్టమేమిటో చంద్రబాబునాయుడు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే వాస్తవాల్ని ప్రజలందరికీ వివరిస్తామని ఆయన చెప్పారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలలా అభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని,  దాన్ని అడ్డుకోవటం చంద్రబాబుకు తగదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులని వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

అతీతంగా ఆలోచిస్తే.. రాజధానికి సరైన ప్రదేశం విశాఖనే!

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ అంశాన్ని అప్పట్లో పంచవర్ష ప్రణాళిక లోనే పొందుపరిచారని గుర్తుచేశారు. విశాఖకు చారిత్రక నేపథ్యం ఉందని, రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే రాజధానికి సరైన ప్రదేశం విశాఖ అని ఆయన చెప్పారు. అన్ని కోడిగుడ్లను ఒక బుట్టలో వేస్తే అవి పగిలిపోయే ప్రమాదముందని, అలాగే రాజధాని అంతా ఒకే ప్రాంతంలో నిర్మిస్తే, ప్రళయం సంభవించినప్పుడు రాష్ట్రం పూర్తిగా నష్టపోతుందని అన్నారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తే ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర  డిమాండ్లు వస్తాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ సత్యవతమ్మ, జి.మాధవి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, భాగ్యలక్ష్మి, ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి కేకే రాజు, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, వరుదు కళ్యాణి, వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు

Published at : 25 Sep 2022 09:01 PM (IST) Tags: AP Latest news Visakha News Visakha YCP Leaders Visakha Cpital AP Capital News

సంబంధిత కథనాలు

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Ramaseshu Murder Case: వైసీపీ లీడర్‌ రామశేషు హత్యపై రకరకాల స్టోరీలు- నిందితులను వెతికే పనిలో పోలీసులు

Ramaseshu Murder Case: వైసీపీ లీడర్‌ రామశేషు హత్యపై రకరకాల స్టోరీలు- నిందితులను వెతికే పనిలో పోలీసులు

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

TTD News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

AP News Developments Today: ఏపీలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఏమున్నాయంటే?

AP News Developments Today: ఏపీలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఏమున్నాయంటే?

టాప్ స్టోరీస్

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

Gujarat Election Results 2022: సీఎంగా సాధించలేనిది, పీఎంగా సాధించిన నరేంద్ర మోడీ - గుజరాత్‌లో భారీ ఆధిక్యం

Gujarat Election Results 2022: సీఎంగా సాధించలేనిది, పీఎంగా సాధించిన నరేంద్ర మోడీ - గుజరాత్‌లో భారీ ఆధిక్యం