News
News
X

CM Jagan Mohan Reddy : మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్, తలసేమియా బాధితుడికి తక్షణ సాయం

CM Jagan Mohan Reddy : సీఎం జగన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో బాధితుల గోడు విన్న సీఎం... తక్షణ సాయానికి ఆదేశాలు ఇచ్చారు.

FOLLOW US: 
Share:

CM Jagan Mohan Reddy : పల్నాడు జిల్లా వినుకొండ ప‌ర్యట‌న‌లో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న పలువురు సీఎంను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. బాధితుల స్థితిని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల క్రితం ఇల్లు కాలిపోయి ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినుకొండకు చెందిన మస్తానమ్మ ముఖ్యమంత్రిని  కలిసి తన సమస్యను విన్నవించుకోవడంతో వెంటనే సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు సీఎం. బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి.. రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు  తేజ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేదని సీఎంకు విన్నవించుకున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న సీఎం..నారాయణస్వామికి తక్షణ సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ లోతేటి వారికి అవసరమైన సాయం చేశారు. 

సీఎంఆర్ఎఫ్ నిధులు అందేలా చర్యలు 

ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి మస్తానమ్మకు వినుకొండ పట్టణ పరిధిలో అనువైన చోట ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి నగదు తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు. అలాగే తేజకు తక్షణ సహాయంగా రూ. 1 లక్ష అందించారు. చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్‌తో చర్చించి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.  సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించి సాయం అందించారన్నారు. 

బాలుడికి వైద్య ఖర్చులు సాయం  

డిసెంబర్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ సీఎం జగన్ ను కలిసి, తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్‌ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు వివరించింది. తన కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్‌ మంజూరు చేయాలని సీఎం జగన్ ను అభ్యర్ధించింది.  దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే బాలుడి వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్  మనజీర్‌ జిలానీ శామూన్‌ ను ఆదేశించారు. బాలుడి వైద్య ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని కన్నీటిపర్యంతమైన ఆ తల్లికి హామీ ఇచ్చారు జగన్. 

Published at : 30 Jan 2023 07:01 PM (IST) Tags: AP News Vinukonda CM Jagan CMRF thalassemia

సంబంధిత కథనాలు

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !