(Source: ECI/ABP News/ABP Majha)
AP Village Secretariat Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం !
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం తమను పర్మినెంట్ చేస్తుందని ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2కే వారి ప్రొబేషన్ పిరియడ్ పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చినా గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులుగా చేరిన వారిలో నిరాశా నిస్పృహలు అలుముకుంటున్నాయి. ఎంతో కష్టనష్టాల కోర్చి పరీక్షలు వ్రాసి ప్రభుత్వం చెప్పినట్లుగా రెండేళ్లు ప్రొబేషన్ పూర్తి చేసుకొన్నా ఇప్పటికి పర్మినెంట్ అయినట్లుగా ఆదేశాలు రాలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 540 సేవలు అందిస్తున్నారు. పింఛన్లు మొదలుకొని ఇంటింటికి బియ్యం సరఫరా, రైతు భరోసా నుండి ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు సైతం చేసే అధికారం సచివాలయ వ్యవస్థకే ఇస్తోంది.
వార్డు , గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలంటే వారికి సూచించిన విధులు, బాధ్యతలతో పాటు పూర్తిస్థాయి జీతాలు కూడా మిగతా ఉద్యోగులతో పాటు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ అది జరగడం లేదు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి తీసుకున్నారు. ప్రతి ఉద్యోగి రెండు సంవత్సరాలు తప్పనిసరిగా ప్రొబేషన్‌ను పూర్తి చేయాలని, ఆ తర్వాత వారందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రొబేషన్ దశలో నెలకు 15 వేలు జీతం చెల్లిస్తామని, 2021 అక్టోబర్ 2 నాటికి అందరినీ పర్మినెంట్ చేస్తామని నియామక పత్రాలు వ్వక్తిగతంగా అందజేసింది. తర్వాత మాట మార్చి మరో మెలిక పెట్టింది. ఈ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటే మరో రెండు పరీక్షలు రాయాలంది.
Also Read : నెల్లూరు పర్యటనకు సీఎం జగన్.. స్థానిక నాయకుల్లో టెన్షన్ టెన్షన్..
ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వ హించినా వాటిల్లో సైతం అధికభాగం ఉత్తీర్ణులయ్యారు. ఈ అక్టోబరు 2 నాటికి గ్రామ/ వార్డు సచివాలయ కార్యదర్శు లందరికీ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేస్తారని ఆశపడ్డారు. కానీ అలాంటి ఉత్తర్వులు రాలేదు. సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలి. పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలంటే ప్రతి నెల మరో రూ. 200 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఆర్థిక వెసులుబాటు లేక ఉద్యోగులకు వేతన సవరణ, కరువుభత్యం వంటివి వాయిదా వేస్తున్న ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు కూడా అందుకే వెనుకడుగు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !
ఆర్థిక సమస్యల కారణంగానే వార్డు, గ్రామ, సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం నిజం అయితే.. ప్రభుత్వ ఆర్థికసమస్యలు ఇప్పుడల్లా తీరే అవకాశం ఉండదన్న ఆందోళన వారిలో ఉంది. అందుకే ప్రభుత్వం వీలైనంత త్వరగా తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతున్నారు .
Also Read : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి