అన్వేషించండి

Pawan Kalyan: జనసేనలోకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ, వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయన్న పవన్ కల్యాణ్

Janasena News: పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ మంగళగిరిలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

MLC Vamsi Krishna Joins Janasena: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తామని  జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన పని చేస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ (Vamsi krishna Yadav) పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో మంగళగిరిలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలపడుతుందన్న పవన్ కల్యాణ్, పార్టీ బలోపేతం కోసం వంశీకృష్ణ యాదవ్‌ పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వంశీకృష్ణకు జనసేనలో మంచి ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇచ్చారు.  వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుందని ఆ పార్టీ చేరారని, అయితే వారు కోరుకున్నట్లు అభివృద్ధి జరగకపోవడంతో ఒక్కొక్కరు అధికార పార్టీని వీడుతున్నారని అన్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వంశీకృష్ణ యువరాజ్యం విభాగంలో పని చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు జనసేనలోకి రావడం సొంతింటికి వచ్చినట్టుందని అన్నారు. విశాఖలో వైసీపీ బలోపేతానికి వంశీకృష్ణ యాదవ్ అహర్నిశలు పని చేశారని అన్నారు. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. 

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీలో సీటు రాదనుకున్న నేతలు, గోడ దూకేస్తున్నారు. పక్క పార్టీలో అసెంబ్లీ సీటును కన్ఫామ్ చేసుకుంటున్నారు. మరో మూడు నెలలు సమయం ఉండగానే, ముందు జాగ్రత్తగా కండువా మార్చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి జనసేనలో వలసలు షురూ అయ్యాయి. భవిష్యత్ ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వైసీపీలో టికెట్ దక్కని నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. టికెట్ ఇచ్చే పార్టీకి జై కొడుతున్నారు. అధికార పార్టీ నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ ఆ పార్టీలో కొనసాగేందుకు కొందరు ససేమిరా అంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget