IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Gudiwada: గుడివాడలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌పై జేసీబీతో దాడి - మాజీ మంత్రి అనుచరుడేనా? అసలేం జరిగిందంటే

Gudiwada: ఆర్ఐ అరవింద్‌ పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ తమ్ముడు గంట కళ్యాణ్ దాడికి పాల్పడిన‌ట్లుగా ప్రచారం జ‌రుగుతుంది.

FOLLOW US: 

గుడివాడలో మట్టి మాఫియా వ్యక్తులు రెచ్చిపోయారు. స్థానిక రెవెన్యూ అధికారి (ఆర్ఐ) అరవింద్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగారు. మాఫియాకు చెందిన 3 జేసీబీలు, లారీలు స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. గుడివాడలో ఆర్ఐ అరవింద్‌ పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబందించిన వివ‌రాలపై విచార‌ణ చేప‌ట్టారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ తమ్ముడు గంట కళ్యాణ్ దాడికి పాల్పడిన‌ట్లుగా ప్రచారం జ‌రుగుతుంది. రెవెన్యూ అధికారులపై దాడి విషయం తెలిసినా పోలీసులు తొలుత నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించార‌నే అరోప‌ణ‌లు వ్యక్తం అయ్యాయి. 

ఘటనా స్థలికి కేవలం కానిస్టేబుల్ ను మాత్రమే పంపి పోలీసులు చేతులు దులుపుకున్నార‌ని అన్నారు. వైసీపీ నేతల ఒత్తిడితో ఘటనను నీరుగార్చే ప్రయత్నం చేశార‌ని స్థానిక నాయ‌కులు ఆరోపించారు. ఆర్ఐ అరవింద్ లంచం అడిగితే డబ్బులు ఇవ్వనందుకే వివాదం వచ్చిందంటూ, వైసీపీ నాయకులు మ‌రో ప్రచారం తెర మీద‌కు తీసుకువ‌చ్చారు. అయితే, ఘ‌ట‌న‌కు కార‌కుల‌యిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవ‌హరం ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేపింది. టీడీపీ నాయ‌కులు కొడాలి ఇలాకాలో మ‌ట్టి మాఫియాపై ఆరోప‌ణలు గుప్పిస్తున్నారు.

మండిపడ్డ నారా లోకేశ్
స్థానిక రెవెన్యూ అధికారి అరవింద్‌పై దాడికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇదంతా గుడివాడ గడ్డం గ్యాంగ్ పనే అంటూ ఆరోపణలు చేశారు. మంత్రి పదవి లేకపోతే ఇక తన విశ్వరూపం చూపిస్తానన్నారని, ఇదేనా విశ్వరూపం అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ఐపై స్థానిక మట్టి మాఫియా వారు దాడికి పాల్పడడం స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ..

‘‘అక్రమాల‌ని అడ్డుకున్న వారికి ఎవ్వరికైనా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని వైసీపీ నేత‌లు హెచ్చరిస్తూనే వున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామ‌ని చెబుతూనే, ఇప్పటికే చాలామందిని అంత‌మొందించారు వైసీపీ నేత‌లు. పోలీసులు, అధికారుల అండ‌తో ప్రజ‌లు, ప్రతి ప‌క్షనేత‌లు, ప్రజా సంఘాల నేత‌ల్ని టార్చర్ చేసిన వైసీపీ నేత‌లు.. త‌మ‌కు అడ్డువ‌స్తే పోలీసుల్ని, అధికారుల్నీ వ‌ద‌ల‌మ‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. వైసీపీ గ‌డ్డం గ్యాంగ్ అరాచ‌కాల‌కు ప‌రాకాష్టగా నిలిచింది గుడివాడ‌లో ఘ‌ట‌న‌. గుడివాడ గ‌డ్డం గ్యాంగ్ క‌ను స‌న్నల్లో సాగే మ‌ట్టి మాఫియాని నిలువ‌రించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అర‌వింద్ పై ఏకంగా జేసీబీతో దాడి చేయ‌డం రాష్ట్రంలో వైసీపీ అరాచ‌కాల‌కు అద్దం పడుతోంది. 

రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు య‌త్నించిన గ‌డ్డం గ్యాంగ్ మ‌ట్టిమాఫియా అరాచ‌కాలు పోలీసుల‌కి ప‌ట్టవా? ఈ రోజు రెవెన్యూ అధికారుల‌పైకి వ‌చ్చిన జేసీబీ పోలీసుల‌పైకీ రాద‌న్న గ్యారెంటీ ఉందా? కృష్ణా జిల్లా గుడివాడ మండలం మార్టూరులో అర్ధరాత్రి సాగుతున్న మ‌ట్టి త‌వ్వకాల‌ని అడ్డుకున్న అర‌వింద్‌పై దాడి ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత గుడివాడ‌ గ‌డ్డం గ్యాంగ్ ప‌నే. మంత్రి ప‌ద‌వి పోయిన‌ క్యాసినో స్టార్ విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నాను. ఇలా త‌న మాఫియా గ్యాంగుల‌ని అడ్డుకునే రెవెన్యూ అధికారుల‌పై దాడులు చేయ‌డ‌మా విశ్వరూపం అంటే..! 

ఆర్ఐ అర‌వింద్ వైపు అదృష్టం ఉండి బ‌తికి బ‌ట్టక‌ట్టాడు. లేదంటే చంపేసేవారే. ద‌య‌చేసి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కాస్తా జాగ్రత్తగా వుండండి. ప్రజ‌ల్ని ఎలాగూ మీరు ర‌క్షించ‌లేరు. మీ ప్రాణాల్నైనా వైసీపీ రాక్షసుల నుంచి కాపాడుకోండి. ఈ ముఖ్యమంత్రి - ప్రభుత్వం కోసం మీరు ప్రాణాలు ప‌ణంగా పెడితే, ఆ ప్రాణాలు తీసుకుంటాడే కానీ మీకు ర‌క్షణ‌గా వుండ‌డు. సీఎం ప్రోత్సాహంతోనే మ‌ట్టిమాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయి. ఆర్ఐపై దాడిచేసిన మ‌ట్టిమాఫియా.. దాని వెనుకున్న గ‌డ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాను. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల‌కి ర‌క్షణ క‌ల్పించాల‌ని కోరుతున్నాను.’’ అని నారా లోకేష్‌ విమర్శించారు.

Published at : 22 Apr 2022 11:08 AM (IST) Tags: Kodali nani attack on revenue inspector Soil mafia in gudivada JCB attack on RI Gudiwada News Kodali Nani Soil Mafia

సంబంధిత కథనాలు

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు

Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!

Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు,  వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?

Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే !  చంద్రబాబు చక్కదిద్దగలరా ?

YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !

YSRCP Politics :  సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ -  వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !