అన్వేషించండి

NTR District: మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాకిచ్చేదెవరు! టీడీపీ సీటు ఫిక్స్ అయిందా!

Mylavaram Assembly constituency: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పై సొంత పార్టిలోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్న సమయంలో టీడీపీ మైలవరం టికెట్ ఆయనకు దక్కదా అనే చర్చ మొదలైంది.

Mylavaram Assembly constituency: మైలవరం తెలుగు దేశం సీటు ఎవరికి దక్కుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పై సొంత పార్టిలోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్న క్రమంలో రోజుకో నాయకుడి పేరు నియోజకవర్గంలో హల్ చల్ చేస్తుంది. 

మైలవరంలో గందరగోళం..
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అధికారికంగా కాని, అనధికారికంగా కానీ, ఆయా నియోజవకర్గాల్లో ఉన్న నేతలకు టిక్కెట్ ఇచ్చే విషయంలో అదినేత ఇప్పటికే క్లారిటి ఇస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం పై మాత్రం ఇప్పటికే సొంత పార్టి నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మైలవరం నియోజవర్గానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన అభ్యర్ది వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఐదేళ్ళ పాటు పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు కు ప్రస్తుతం సొంత పార్టిలోని నాయకులే షాక్ లు ఇస్తున్నారు.

ఉమాపై అసంతృప్తి ...
మంత్రి హోదాలో ఐదు సంవత్సరాల పాటు పని చేసిన దేవినేని ఉమాపై స్థానిక నాయకత్వం, క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా విజయం కోసం పని చేసిన నాయకత్వాన్ని ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా 2014 ఎన్నికల సమయంలో ఆర్దికంగా సహకరించిన అతి తక్కువ మంది నేతలను కూడ దేవినేని ఉమా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆ ప్రభావం 2019 ఎన్నికల సమయంలో చూపించారని అంటున్నారు. ఇక మంత్రిగా పని చేసిన సమయంలో పార్టి క్యాడర్ కు చిన్న చిన్న పనులు కూడ చేయకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరించారని, దేవినేని ఉమాపై నాయకులు అసహనంతో ఉన్నారు.

నియోజవకర్గంలో రోజుకో నేత పేరు ప్రచారం..
మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఉన్న అసంతృప్తి  కారణంగా రోజుకొక నేత పేరు తెర మీదకు వస్తోంది. అంతే కాదు తెలుగుదేశం పార్టికి చెందిన  వాట్సాప్ గ్రూపుల్లోనే వాటిని ప్రచారం చేయటం విశేషం. మైలవరం నియోజకవర్గం కోసం టీడీపీలోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దేవభక్తుని సుబ్బారావు పేరు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్న గన్నే వెంకట నారాయణ ప్రసాద్, అలియాస్ అన్న పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పార్టిలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమాకు వ్యతిరేకంగా క్యాడర్, నియోజకవర్గ నేతలు అస్త్రాలను సిద్దం చేసుకుంటున్న సమయంలో ఈ వ్యవహరం పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికార పార్టీ నుంచి మైలవరం ఎమ్మెల్యే వసంత కూడ దేవినేని ఉమాను టార్గెట్ గా చేసుకొని రాజకీయం చేస్తున్నారు. అదికార పక్షం దూకుడు మీద ఉన్న క్రమంలో సొంత పార్టీలోనే నాయకులు దేవినేని ఉమాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటంపై ఆసక్తి నెలకొంది. ఓ వైపున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతకు అధిక సీట్లు కేటాయింపు అంశంపై పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి కీలక నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget