Durga Temple: చీర,చున్నీ లేకుండా దుర్గ గుడి దర్శనానికి రావొద్దు! విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్రొత్త రూల్స్
Vijayawada: చీర చున్నీ లేకుండా దుర్గ గుడి దర్శనానికి రావొద్దు. విజయవాడ దుర్గ గుడి లో క్రొత్త రూల్స్. బెజవాడ దుర్గ గుడి లో భక్తులకు కొత్త రూల్స్ ఇవే.. కచ్చితంగా పాటించాల్సిందే

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గ గుడిలో క్రొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇటీవల భక్తులు మరీ మోడరన్ గా ఉండే డ్రెస్ లతో ఆలయ ప్రవేశం చేయడం.. కొందరు మగవాళ్ళు ఏకంగా షార్ట్ వేసుకుని మరీ గుడిలోకి రావడంపై అనేక విమర్శలు వచ్చాయి. కొంతమంది భక్తులు మొబైల్ ఫోన్ లను లోపలికి తీసుకువెళ్లి అమ్మవారి ఫోటోలు దొంగతనంగా తీయడం ఆలయ ప్రతిష్ట దెబ్బ తినేలా వాటిని అనుచిత రీతిలో సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం వంటివి తీవ్ర విమర్శలు పాలయ్యాయి. దీనితో ఇకపై గుడిలో కఠిన నిబంధనలు అమలులో పెడుతున్నట్టు దుర్గ గుడి ఈవో శీనా నాయక్ తెలిపారు.

చీర, చున్నీ లేకపోతే మహిళలకు గుడి లోకి ప్రవేశం ఉండదు
ఇకపై భక్తులు కచ్చితంగా మొబైల్ భద్రపరచిన తరువాతే ఆలయ దర్శనానికి రావాలని తెలిపారు దుర్గ గుడి ఈవో. ఆలయంలోపలికి సిబ్బందితో సహా ఎవరికి ఫోన్స్ తో ఇకపై ప్రవేశం ఉండదు.
అభ్యంతరం లేని దుస్తులు ధరించి మాత్రమే అమ్మవారి గుడిలోకి రావాలి అనేది అమలు చేస్తున్నారు. చీర గానీ చున్నీ గానీ కాకుండా వేరే మోడరన్ దుస్తుల్లో వచ్చే మహిళల కోసం మహా మండపం ఎంట్రన్స్ వైపు, ఘాట్ రోడ్ ఓం టర్నింగ్ దగ్గర - చున్నీలు(చున్నీ లేకుండా వచ్చే స్త్రీల కోసం), పంచెలు (పురుషులు ఎవరైనా షార్ట్స్ వేసుకుని వస్తే వారి కోసం) దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరికాయ /పూజ సామాగ్రి అమ్మే కౌంటర్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు ఈవో తెలిపారు.

చున్నీ లేని వారిని, షార్ట్స్ వేసుకుని వచ్చే వారిని వెనక్కి పంపడం తమ ఉద్దేశ్యం కాదనీ వారిని దేవాలయ కట్టుబాట్లు అనురింప జేయడమే తమ లక్ష్యం అనీ దుర్గ గుడి ఈవో తెలిపారు.
అంతరాలయ దర్శనంకి డ్రెస్ కోడ్ సంబంధం లేదనీ కానీ అభ్యంతరమైన దుస్తులు ధరించినవారిని నిండుగా వస్త్రాలు ధరించి ఆలయంలోనికి రండి అని మనవి చేస్తున్నామనీ అధికారులు చెబుతున్నారు.

అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే ||
అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ |
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ||
సాపరాధోఽస్మి శరణం ప్రాప్తస్త్వాం జగదంబికే |
ఇదానీమనుకంప్యోఽహం యథేచ్ఛసి తథా కురు ||
అజ్ఞానాద్విస్మృతేర్భ్రాంత్యా యన్న్యూనమధికం కృతమ్ |
విపరీతం చ తత్సర్వం క్షమస్వ పరమేశ్వరి ||
కామేశ్వరి జగన్మాతః సచ్చిదానందవిగ్రహే |
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి ||
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి ||
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి ||
సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్ |
అతోఽహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీమ్ ||
ఇతి అపరాధక్షమాపణస్తోత్రం సమాప్తమ్ ||





















