అన్వేషించండి

Krishna Godavari Floods: ఏపీలో కృష్ణా గోదావరి నదులకు వరద పోటు... అధికారులు చెబుతున్న జాగ్రత్తలు ఇవే..!

Krishna Godavari Floods: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా గోదావరి నదులకు వరద పోటెత్తితోంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు చెబుతున్న జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

Krishna Godavari Floods: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర ప్రదేశ్లోని కృష్ణా గోదావరి నదులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. అంతే కాకుండా ఏపీ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 1.5 & 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడకక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

కృష్ణా,గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా కొనసాగుతుందని ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం రాత్రి 9 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,48,100 క్యూసెక్కులు ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. గరిష్ఠంగా ప్రకాశం బ్యారేజి వద్ద 7 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉందన్నారు.

గోదావరి నది భద్రాచలం వద్ద 46.4 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 9,93,318 లక్షల క్యూసెక్కులు ఉందని, రాత్రికి మొదటి హెచ్చరిక చేరుతుందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఎల్లుండికి దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

సహాయక చర్యల కోసం 2 NDRF, 4 SDRF బృందాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీపరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

కృష్ణా, గోదావరి వరద ప్రవాహం కొనసాగుతున్న నేేపథ్యంలో వరద సమయంలో జాగ్రత్తలు  పాటించాలని ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 

వరదల సమయంలో..

• వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
• మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
• విద్యుద్ఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి.
• ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆ ప్రదేశంలొ కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
• వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి.
• తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి.
• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి.
• మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి. 

వరదల తరువాత..

• మీ పిల్లలను నీటిలోకిగాని, వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి.
• దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి.
• అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను, ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.
• విరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, పదునైన వస్తువులు, శిథిలాలను నిశితంగా పరిశీలించండి.
• వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు.
• మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
• వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.పాముకాటుకు ప్రథమ చికిత్స తెలుసుకోండి.
• నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి.
• నీరు తాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు. 

మీరు ఖాళీ చేయవలసి వస్తే..

• మంచం, టేబుళ్లపై మీ ఫర్నిచర్, ఇతర ఉపకరణాలను పెట్టండి.         
• మీ కరెంట్, గ్యాస్ కనెక్షన్ ఆపివేయండి
• ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి.
• మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
• లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు, నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
• అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. 
• కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. 
• తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి. క్రిమిసంహారకం చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget