అన్వేషించండి

ఏపీలో అమల్లోకి రెడ్ బుక్ రాజ్యాంగం! వైసీపీ కార్యకర్తలను కలిసిన తరువాత పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

Andhra Pradesh News | ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, అందుకే వైసీపీ కార్యకర్తలు, పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

Former AP Minister Perni Nani | గన్నవరం: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలపై, పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శలు గుప్పించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో రిమాండ్ లో వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. శనివారం నాడు గన్నవరం సబ్ జైల్ కు వెళ్లి రిమాండ్ లో ఉన్న నలుగురు వైసీపీ కార్యకర్తలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. 

గన్నవరం నియోజకవర్గంలో 2023 ఫిబ్రవరిలో వైసీపీ కార్యాలయం పైకి విజయవాడ నుంచి వచ్చిన కొందరు రెచ్చగొట్టేలా చేశారు. వారి చర్యలతో ఆత్మరక్షణ కోసం వైసీపీ కార్యకర్తలు చేసిన చర్యలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేస్తున్నారని పేర్నినాని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు, జగన్ సానుభూతిపరులన్న కారణంగానే వారిపై సంబంధం లేని విషయాలపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అక్రమ ఇసుక, లే ఔట్ లపై దృష్టి పెట్టింది.

తప్పుడు కేసులతో అంతా భయపడుతున్నారు! 
ఏపీలో అధికారం తమ చేతుల్లో ఉందన్న కారణంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులను 7 నుంచి 71 వరకు పెంచారు. ఈ కేసులో ఏ71గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరును పోలీసులు చేర్చారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే అక్రమ కేసుల్లో అరెస్టైన వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆదేశించారు. జగన్ ఆదేశాలతో నూజివీడులో ఉన్న 15 మందిని, అదే విధంగా గన్నవరం సబ్ జైల్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించాం. ఏపీలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభివృద్ధి, సంపద సృష్టించేలా కనిపించడం లేదు. 

టీడీపీ కార్యకర్తల చేతిలో దాడులకు గురైన వారిని, అక్రమ కేసులు నమోదైన వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. వైసీపీ జెండా మోసే కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని జగన్ సూచించారు. గన్నవరంలో వైసీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. వల్లభనేని వంశీ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్రమ కేసుల నుంచి బయటపడేందుకు, చట్టపరమైన హక్కులు వినియోగించుకుంటూ కోర్టును ఆశ్రయించారు. దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు’ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.

Also Read: బొత్సకు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి - ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కూటమి కసరత్తు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Embed widget