Vallabhaneni Vamsi Hospitalised: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత, మొహాలీలోని ఆసుపత్రిలో చికిత్స
Gannavaram MLA Vamsi Hospitalised: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు లోనయ్యారు.
MLA Vallabhaneni Vamsi Admitted to Hospital: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు లోనయ్యారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరి టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని మొహాలీ వైద్యులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనారోగ్యం నుంచి కోలుకుని వంశీ ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది.
కాగా, గన్నవరం ఎమ్మెల్యే వంశీ ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School Of Business) హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించారు. ప్రస్తుతం ఆయన అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (AMPPP) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్ లోని మొహాలీ క్యాంపస్ నుంచి ఆఫ్ లైన్ క్లాసులకు వంశీ హాజరవుతున్నారు. ప్రస్తుతం మూడో సెమిస్టర్ క్లాస్‌లు జరుగుతున్నట్లు సమాచారం. క్లాసులకు హాజరైన ఎమ్మెల్యే వంశీకి మంగళవారం నాడు ఎడమ చేతి విపరీతంగా లాగి నొప్పి వచ్చింది. దీంతో ఆయన మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
Also Read: Aamanchi CBI : ఆమంచికి సీబీఐ నోటీసులు - బుధవారం రావాలని ఆదేశం ! ఏ కేసులో అంటే ?
Also Read: పోటీ లేని ఆత్మకూరులోనూ సర్వశక్తులు ఒడ్డుతున్న వైఎస్ఆర్‌సీపీ ! మెజార్టీ కోసమేనా ?