Floods in AP Telangana: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధులు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Vijayawada Floods | వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు లాంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Flood affected area people should take these precautions to avoid fever and diseases | విజయవాడ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వరదలతో ప్రాణనష్టం సంభవించింది. వర్షాలు తగ్గడంతో ఇప్పుడిప్పుడే వరద ప్రాంతాల వారు కాస్త కోలుకుంటున్నారు. అయితే వర్షాకాలం సీజన్ అనగానే అంటువ్యాధులు, జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, విరేచనాలు లాంటి సమస్యలు వస్తుంటాయి. అందులోనూ వరదల పరిస్థితుల్లో మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని, వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ప్రజలకు పలు సూచనలు చేశారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నీళ్ల విరేచనాలు, జ్వరం, వాంతుల నుండి తక్షణ చికిత్స కోసం దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. సూచనలు, సలహాల కోసం మీ స్థానిక ఎఎన్‌ఎం (ANM)కు వెంటనే ఫోన్ చేయాలని వరద ప్రభావిత ప్రాంతాల వారికి సూచించారు.
- వరద ప్రభావిత ప్రాంతాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
- కాచి, చల్లార్చి, వడపోసిన మంచి నీటిని మాత్రమే తాగండి. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- భోజనానికి మందు, మల విసర్జన తర్వాత చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి
- కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లు, రోళ్లలో నీరు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి. దాంతో డెంగ్యూ దోమల లార్వాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తగా ఉండాలి.
- జ్వరాలు, అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- కొన్ని రోజులపాటు తలనొప్పి, దగ్గు జ్వరం, ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి
- ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి
- అత్యవసర పరిస్థితుల్లో 108కి ఫోన్ చేసి సహాయం పొందాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు.
Also Read: Child Health: ఉన్నోళ్లకి ఒబేసిటీ, లేనోళ్లకి అనీమియా - అత్యంత దారుణంగా దేశంలో పిల్లల పరిస్థితి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

