Vellampalli Srinivas: మాజీ మంత్రిని నిలదీసిన యువకుడు- తక్షణం కేసు పెట్టాలన్న వెల్లంపల్లి- తలలు పట్టుకున్న పోలీసులు !

Vellampalli Gets Angry: గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన వెలంప‌ల్లిని ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న నాగ‌రాజు అనే యుకువ‌డు బ‌హిరంగంగా నిల‌దీశారు. 

FOLLOW US: 

Ex Minister Vellampalli Gets Angry: అధికార పార్టీ నేత‌ల‌కు అడుగడుగునా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఐదు సంవ‌త్స‌రాల తాము అధికారంలో ఉంటాం అనే ఉత్సాహంతో ఉన్న నేతలు, తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయ‌నే ప్ర‌చారంతో డీలా పడుతున్నట్లు కనిపిస్తున్నారు. అందుకు గడప గడపకూ నేతలను ప్రజల నిలదీతలే కారణమని చెప్పవచ్చు. అంద‌రి ముందే ప్ర‌జా ప్ర‌తినిదుల‌ను నిల‌దీస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడలో మాజీ మంత్రి వెలంప‌ల్లికి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. స్దానికంగా ఉన్న 50వ డివిజ‌న్ లో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం (Gadapa Gadapaku Mana Prabuthavam) కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన వెలంప‌ల్లిని ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న నాగ‌రాజు అనే యుకువ‌డు బ‌హిరంగంగా నిల‌దీశారు. 

యువకుడి విమర్శలు.. మాజీ మంత్రి ఆగ్రహం.. 
కోట్ల రూపాయ‌లు వెలంప‌ల్లి దోచుకున్నార‌ని నాగ‌రాజు  త‌న ఇంటి గుమ్మం ముందుకు వ‌చ్చిన మాజీ మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వెలంప‌ల్లితో పాటుగా ఆయ‌న అనుచ‌రులు కూడ ఖంగుతున్నారు. వెంట‌నే తేరుకున్న వెలంప‌ల్లి మీకు ఎవ‌రు చెప్పారు. ఎందుకు అలా మాట్లాడార‌ని అడిగారు. అయితే ఇదంతా అంద‌రికి తెలిసిందే చెప్పానంటూ నాగ‌రాజు వెలంప‌ల్లి కిగ‌ట్టిగానే బ‌దులిచ్చారు. దీంతో వెంట‌నే వెలంప‌ల్లి అనుచ‌రులు క‌ల‌గ‌చేసుకొని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌తావా... నీకు ఎవ‌రు చెప్పారో చెప్పాలంటూ వాగ్వాదానికి దిగారు. అయితే మ‌రోసారి వెల్లంప‌ల్లి క‌ల‌గచేసుకొని నాగ‌రాజుతో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించినా అత‌ను మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా తాను అన్న‌మాట‌లు బ‌హిరంగ ర‌హ‌స్య‌మేనంటూ మ‌రోసారి మాట్లాడాడు. దీంతో వెలంప‌ల్లిని చిర్రెత్తుకోచ్చింది. వెంట‌నే పోలీసుల‌ను పిలిచి నాగ‌రాజును అరెస్ట్ చేయాల‌ని ఆదేశించారు. ఆధారాలు చూప‌కుంటే కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. దీంతో పోలీసులు నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల మ‌ల్ల‌గుల్లాలు...
మాజీ మంత్రి వెల్లంపల్లిని గట్టిగానే నిలదీయడంతో ఊహించ‌ని ఘ‌ట‌న‌తో అధికార పార్టి నేత‌ల‌తో పాటుగా పోలీసుల‌కు కూడా త‌లనొప్పిగా మారింది. ఎటువంటి ఫిర్యాదు లేకుండా, ఎవ‌రు లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేయ‌కుండా ఎదో మాట్లాడిన యువ‌కుడిపై కేసు పెట్ట‌టం అది కూడా అంద‌రి ముందూ అరెస్ట్ చేస్తే వ‌చ్చే న్యాయ‌ప‌ర‌మైన చిక్కులపై పోలీసులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలో పోలీసుల వ్య‌వ‌హ‌ర శైలిపై విమ‌ర్శ‌లు రావ‌టంతో ఈ ఘ‌ట‌న త‌రువాత పై ఎం చేయాల‌నే ఆలోచ‌న‌లో పోలీసులు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. అంద‌రిలో బ‌హిరంగంగా యువ‌కుడిని పోలీసులు తీసుకువెళితే ఇబ్బందులు వ‌స్తాయ‌నే ఉద్దేశంతో పోలీసులు కూడా వెన‌కాడాల్సి వ‌చ్చింది.

బాధితుడికి మద్దతుగా జనసేన
వెలంప‌ల్లిని ప్ర‌శ్నించిన నాగ‌రాజును పోలీసులు స్టేష‌న్ కు త‌ర‌లించ‌టంతో స్దానిక జ‌న‌సేన నాయ‌కులు రంగంలోకి దిగారు. విజ‌య‌వాడ జ‌న‌సేన పార్టి న‌గ‌ర అధ్యక్షుడు పోతిన మ‌హేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నాగ‌రాజుకు మ‌ద్ద‌తుగా నిలిచారు. స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అవినీతిని మరియు చెత్తపై పన్నుల భారాన్ని మోయలేక పోతున్నామని ప్రశ్నించిన  ఇంజనీర్ నాగబాబు పై కేసులు మోపాలని హుకుం జారీ చేసిన వెల్లంపల్లి తీరును నిరసిస్తూ, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నాగబాబును పరామర్శించిన పోతిన మహేష్ అధికారులతో మాట్లాడి తక్షణమే నాగబాబు విడిపించి బయటికి తీసుకువచ్చారు. ప్రశ్నించే ప్రతి గొంతును అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్ లు చాలవని సమాధానం చెప్పలేకే వెలంప‌ల్లి  పారిపోయారని, ఆయ‌న అవినీతి, అక్రమాలపై జ‌న‌సేన ఇప్ప‌టికే అనేక సార్లు పోరాటం చేసింద‌ని పోతిన మ‌హేష్ అన్నారు.

Published at : 18 Jun 2022 02:46 PM (IST) Tags: YSRCP vijayawada AP News AP Politics Vellampalli Srinivas Gadapa Gadapaku Mana Prabuthavam

సంబంధిత కథనాలు

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి

TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్