(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu News: చంద్రబాబుపై పెట్టిన IPC సెక్షన్ 409 అంటే ఏంటి? దీనికింద ఆయనకి బెయిల్ వస్తుందా రాదా?
విజయవాడ ఏసీబీ కోర్టులో గత మూడు గంటల నుంచి వాదనలు జరుగుతున్నాయి.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం, ఎవరైనా, ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే, లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి, కారకం, బ్రోకర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం లేదా ఏజెంట్, ఆ ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే, జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు పొడిగించబడే వివరణతో కూడిన జైలు శిక్ష విధిస్తారు. దీంతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
సాధారణ వివరణ ప్రకారం IPC 409 ప్రభుత్వోద్యోగి లేదా వారి వృత్తిలో ఆస్తిని అప్పగించిన వారు (బ్యాంకర్, వ్యాపారి, న్యాయవాది మొదలైనవి) నిజాయతీగా ఆ నమ్మకాన్ని ఉల్లంఘిస్తే, వారికి జీవిత ఖైదు లేదా పది సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానాతో పాటుగా శిక్ష వేస్తారు.
ఆ తర్వాతే బెయిల్ కి దరఖాస్తు చేసుకోవచ్చు - లక్ష్మీ నారాయణ
చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లలో సెక్షన్ 409 ఉండటం వల్లనే సీఐడీ పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయగలిగారని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. అభియోగం మోపినంత మాత్రాన సరిపోదన, ఆ అరెస్ట్‌కు గల కారణాలను వివరించాల్సి ఉంటుందని చెప్పారు. స్కిల్ కేసులో చంద్రబాబు లబ్ధి పొందినట్లుగా సీఐడీ బలమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఒకవేళ ఏపీ సీఐడీ చంద్రబాబును కస్టడీకి ఇవ్వమని కోర్టును అడిగితే దానికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందని అన్నారు. పోలీస్ కస్టడీ అవసరం లేదనుకుంటే కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశం ఉందని చెప్పారు. ఈ రెండింటిలో ఏది జరిగినా వెంటనే హైకోర్టులో బెయిల్‌కు అప్లై చేసుకొనే అవకాశం ఉంటుందని వివరించారు. ఆదివారం నాడు కూడా బెయిల్ కోసం హౌస్ మోషన్ మూవ్ చేసేందుకు అవకాశం ఉందని లక్ష్మీ నారాయణ వివరించారు.
ఉదయం 6 గంటల నుంచి వాదనలు
విజయవాడ ఏసీబీ కోర్టులో గత మూడు గంటల నుంచి వాదనలు జరుగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించి సంస్థ తరపు న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. అనంతరం కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. స్కిల్ డెవలప్ మెండ్ స్కామ్‌తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. ఈ మేరకు నోటీసు ఇచ్చారు. 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు.