YS Sharmila Tweet On Jagan: పిత్తపరిగల వేట ఎన్నాళ్లు, తిమింగలాన్ని పట్టుకోండి- ప్యాలెస్ డొంక కదిలించండి- ప్రభుత్వానికి షర్మిల సూచన
Andhra Pradesh: గత ఐదేళ్లుగా సహజ వనరుల్లో జరిగిన దోపిడీని ప్రజల ముందు ఉంచేలా సీబీఐ దర్యాప్తు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్యాలెస్‌లో ఉన్న దోపిడీదారులను బయటకు లాగాలన్నారు.
![YS Sharmila Tweet On Jagan: పిత్తపరిగల వేట ఎన్నాళ్లు, తిమింగలాన్ని పట్టుకోండి- ప్యాలెస్ డొంక కదిలించండి- ప్రభుత్వానికి షర్మిల సూచన APPC chief Sharmila demanded a CBI inquiry into the exploitation of natural resources in the state for last five years YS Sharmila Tweet On Jagan: పిత్తపరిగల వేట ఎన్నాళ్లు, తిమింగలాన్ని పట్టుకోండి- ప్యాలెస్ డొంక కదిలించండి- ప్రభుత్వానికి షర్మిల సూచన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/28/2373fadfd067b1a3873ab47a84346a311727511768608215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YS Sharmila Demand On Jagan decisions in Mining Sector: గనుల దోపిడీకి పాల్పడిన వారికి అండగా ఉన్నారని ప్రధాన పాత్ర పోషించారని వెంకట్ రెడ్డి అనే అధికారిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు ఏసీబీ ప్రయత్నం చేస్తోంది. ఇంతలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల కీలక సూచనలు చేశారు. పట్టుకోవాల్సింది చిన్న చిన్న వ్యక్తుల్ని కాదని పెద్ద పెద్ద వారిపై ఫోకస్ చేయాలని సూచించారు.
షర్మిల ఏమన్నరంటే..." YCP ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు. పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్‌లో ఉన్నా విచారణ జరపాలి అని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు.
YCP @YSRCParty ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు... పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాలి. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే...తెరవెనుక ఉండి,సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి…
— YS Sharmila (@realyssharmila) September 28, 2024
ఆ దోపిడీ వెనుకున్న ఘనుడెవరో అందరికీ తెలుసు: షర్మిల
ముందున్న అధికారి వందల కోట్లు దోచుకుంటే వెనకున్న వాళ్ల దోపిడీ ఎంత ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు షర్మిల. ఆ వ్యక్తి ఎవరు ప్రజలకు బాగా తెలుసు అన్నారు. " రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే, తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు.
తిమింగలాన్నే పట్టుకోండి: షర్మిల
చిన్న చేపల వేట ఎన్నాళ్లని ప్రశ్నించిన షర్మిల తిమింగలాన్ని పట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. " టెండర్లు,ఒప్పందాలు,APMMC నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. NGT నిభందలను తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు. అని ఆరోపించారు.
వారి దోపిడీ స్థాయికి ఏసీబీ సరిపోదు సీబీఐ కావాలి: షర్మిల
ఈ భారీ దోపిడీపై ఒక్క ఏసీబీ విచారణ మాత్రమే సరిపోదన్న షర్మిల... సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. "గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ACB విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలి. సహజ వనరుల దోపిడీపై CBI విచారణను కోరండి అని కూటమి సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నాం. అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Also Read: తిరుపతి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)