News
News
X

కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఎపిసోడ్స్‌పై జగన్ వ్యూహమేంటి? జిల్లా కోఆర్డినేటర్లకు ఏం చెప్పనున్నారు?

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రాటజీ ప్రకటిస్తారనేది తేలనుంది.

FOLLOW US: 
Share:

సీఎం జగన్ నేడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జిల్లాల వారీగా రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రామ్‌తోపాటు తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో సీఎం జగన్ చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సొంత పార్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కోటంరెడ్డిపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న వైసీపీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఈ భేటీ తర్వాత ఇంకా ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్న చర్చ నడుస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో పార్టీలో ఉన్న కొన్ని సమస్యలు, జనంలో ఎక్కువగా తిరగడం వచ్చే ఎన్నికల ప్రధాన ఎజెండాపై చర్చించనున్నారని అంటున్నారు. 

జిల్లాలా వారీగా బయట పడుతున్న విభేదాలు..

ఇప్పటికే గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వరుసగా రోజుకో వివాదం జిల్లాల్లో బయటకు వస్తుంది. కృష్ణా జిల్లాలో మైలవరం, పెడన నియోజకవర్గాలకు సంబంధించిన అంశం అత్యంత కీలకంగా మారింది. మంత్రిగా వ్యవహరిస్తున్న జోగి రమేష్ తన నియోజకవర్గంలో వేలు పెట్టి ఇస్టానుసారంగా వ్యవహరాలు సాగించటంపై పార్టీ నేతల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. అయినా ఈ వ్యవహరంలో పార్టీ పెద్దలు స్దానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను లెక్క చేయకుండా బీసీ మంత్రి అయన జోగి రమేష్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ ఉంది. ఈ వ్యవహరంలో సీరియస్ అయిన వసంత, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ నాయకులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి, స్థానికంగా బలంగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాను ఢీకొట్టటానికి వసంతను వాడుకొని వదిలేశారనే ప్రచారం కూడా మొదలైంది. 

గుంటూరులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవిని కాదని, అక్కడ నియోజకవర్గానికి మరొక పర్యవేక్షుడిని నియమించటంతో మొదలైన వివాదం ఇప్పటికి నివురుగప్పిన నిప్పులానే ఉంది. గుంటూరు పశ్చిమంలో కూడా ఇదే పరిస్థితి. గుంటూరు పశ్చిమంలో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరి విజయం సాధించారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ డీఐజీ ఏసురత్నం ఇంచార్జ్ గా ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా లేళ్ళ అప్పిరెడ్డిని పార్టీ నియమించింది. అక్కడ కూడా పార్టీ అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఇంచార్జ్‌గా ఉన్న ఏసురత్నంను కాదని టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మద్దాలి గిరికి ప్రాధాన్యత ఇవ్వటం, అదే నియోజకవర్గంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కూడా చక్రం తిప్పటంతో విభేదాలు కామన్ అయ్యాయి. దీంతో పార్టీ కార్యకర్తలు మూడు గ్రూపుల్లో దగ్గరకు వెళితే ఏం అవుతుందో అనే సంకోచంలో పడ్డారని అంటున్నారు.

తాజాగా నెల్లూరు ఎపిసోడ్ 

తాజాగా నెల్లూరు జిల్లాలో కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కామెంట్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆనం వ్యవహరం కూడా పార్టీకి మింగుడు పడనీయకుండా చేసింది. దీనిపై రాష్ట్ర హోం శాఖకు చెందిన అధికారులు కూడా రంగంలోకి దిగారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, హోంశాఖ వర్గాలు కూడా జగన్‌తో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్‌గా వ్యవహరించాలని జగన్ అటు హోం శాఖ అధికారులకు, పార్టీ నేతలకు ఆదేశించారని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో నేడు మధ్యాహ్నం జరగనున్న సమావేశంలో ఇంకా ఏం చెప్తారనే ఉత్కంఠ ఉంది. అందుకే అందరి ఫోకస్ ఈ భేటీపై ఉంది. 

Published at : 02 Feb 2023 10:05 AM (IST) Tags: YS Jagan YSRCP AP Politics ap updates YSRCP Regional Co-Ordinators

సంబంధిత కథనాలు

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

ఏపీలో ప్రభుత్వం తరఫున ధర్మ ప్రచార కార్యకమం- జనంలోకి ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాలు !

ఏపీలో ప్రభుత్వం తరఫున ధర్మ ప్రచార కార్యకమం-  జనంలోకి ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాలు !

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?