Aadhaar DOB Change: బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్లు ఆధార్‌లో పుట్టిన తేదీ ఎలా మార్చుకోవాలి- ఏపీలో రాబోతున్న రూల్ ఏంటీ?
Aadhaar Update Online:ఆధార్ కార్డులో మార్పులు చేర్పులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకురానుంది. దీంతో పుట్టిన తేదీ సవరణ మరింత సులభతరం కానుంది.
Date Of Birth Change In Aadhar Card Documents: ఆధార్ కార్డు లేనిదే ఇప్పుడు ఏ పని కూడా ముందుకు సాగదు. అలాంటి ఆధార్ కార్డులో తప్పులతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఫోన్ నెంబర్ మార్పు, పుట్టిన తేదీ మార్పు, పేరు మార్పు ఇలా చాలానే ఉంటాయి. ప్రతి దానికో పరిష్కారాన్ని ప్రభుత్వం చూపిస్తోంది. అన్నింటిది ఒక లెక్క అయితే పుట్టిన తేదీని సరిదిద్దుకోవాలంటే మాత్రం చాలా సమస్యలు ఎదురు అవుతున్నాయి. ముఖ్యంగా అధికారిక ధ్రువీకరణ పత్రం లేని నిరక్షరాస్యులు ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రూల్ తీసుకురాబోతోంది. దీంతో ఇప్పుడు ఈజీగా ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరించుకోవచ్చు. మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. పుట్టిన తేదీకి సంబంధించిన సర్టిఫికేట్స్ లేని వాళ్లు ప్రభుత్వ వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. వివిధ పరీక్షలు చేసిన తర్వాత ఆ వ్యక్తి వయసును అంచనా వేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు ఇచ్చే సర్టిఫికేట్‌తో పుట్టిన తేదీని మార్చుకోవచ్చు.
గత నెల 14 వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలంటే 50 రూపాయలు వసూలు చేస్తోంది. అడ్రెస్ మారడం నుంచి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్, పుట్టిన తేదీలో మార్పులు ఇలా ఏ అప్‌డేట్ చేయాలన్నా యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటిన వారంతా కూడా అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. కార్డులో మార్పులు అవసరం లేకపోయినప్పటికీ విధిగా అప్‌డేట్ చేసుకోవాలని హితవు పలికింది. ఆధార్ కార్డులో చాలా వరకు అప్‌డేట్స్ మీకు మీరుగానే చేసుకోవచ్చు. కొన్నింటికి మాత్రం సీఎస్‌సీకి వెళ్లాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్‌లో అడ్రస్ వివరాలు ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Address in Aadhaar Card?)
ఇల్లు మారితే, కొత్త అడ్రస్‌ను మీ ఆధార్ వివరాల్లో అప్‌డేట్ చేసుకోవడం చాలా చిన్న విషయమే. అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఆన్‌లైన్‌లో మీకు మీరుగానే చేసుకోవచ్చు. దీనికి అడ్రస్ ప్రూఫ్‌తోపాటు ఫోన్‌నెంబర్ కూడా ఉండాలి.
- myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి
- ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని కూడా అక్కడ ఫిల్ చేయాలి.
- మీ పేరు/ జెండర్/ పుట్టిన తేదీ, చిరునామాల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి.
- 'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్ చేయాలి.
పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా?
ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (URN) వస్తుంది. దాని ఆధారంగానే ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ (Aadhaar Updation Status) ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ చేసిన 2,3 రోజుల తర్వాత https://ssup.uidai.gov.in/CheckAadhaarStatus/enలింక్ ద్వారా ఆధార్ కార్డ్ అప్‌డేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
అడ్రెస్ మార్చినంత ఈజీగా మనం పుట్టిన తేదీని మీకు మీరుగా ఆన్‌లైన్‌లో మార్చుకోలేరు. Aadhaar Seva Kendra లేదా Aadhaar Enrolment Centreకు వెళ్లి మాత్రమే పుట్టిన తేదీ వివరాలు మార్చుకోగలరు. ఇలా పుట్టిన తేదీ వివరాలు మార్చుకోవడానికి వెళ్లేటప్పుడు ఈ పత్రాలు తీసుకెళ్లాలి. పాస్‌పోసర్టు లేదా. పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రం, గుర్తింపు కార్డు.
అసలు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులో ఏవివరాలు మార్చుకోగలం
- పేరు
- జెండర్
- అడ్రెస్
- మొబైల్ నెంబర్
- ఐడెంటీ ప్రూఫ్
- అడ్రెస్ ప్రూఫ్