పదేళ్లుగా ఎలాంటి మార్పులు చేయని వారి కోసం UIDAI అవకాశం 'myAadhaar' పోర్టల్ ద్వారా మార్చి 14, 2024 వరకూ ఫ్రీగా ఆధార్ అప్ డేట్



రూ.50 నామమాత్రపు రుసుముతో ఏదైనా ఆధార్ సెంటర్లలోనూ అప్ డేట్ సేవలు



myaadhaar.uidai.gov.inకు వెళ్లాలి 'Download Aadhaar'పై క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ వివరాలు అందించి 'Send OTP'పై క్లిక్ చేయాలి



మొబైల్ కు OTP వచ్చిన తర్వాత 'Verify And Download'పై క్లిక్ చేస్తే ఆధార్ డౌన్ లోడ్ చెయ్యొచ్చు



ఆధార్ నెంబర్, అనుసంధానమైన మొబైల్ నెంబర్, స్కాన్‌ ఐడీ ప్రూఫ్స్ సాయంతో myaadhaar.uidai.gov.inలో లాగిన్ అయ్యి మీ పేరు/జెండర్/పుట్టినతేదీ/చిరునామా ఆప్షన్స్ ఎంచుకోండి



'అప్ డేట్ ఆధార్' ఆప్షన్ ఎంచుకుని స్కాన్ చేసిన ఫ్రూప్స్ కాపీలను అప్ లోడ్ చేసి అప్ డేట్ చేయాలి. ఆ తర్వాత 'URN' ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.



మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి అడ్రెస్‌లో తప్పులు దొర్లినా, మార్పులు చేయాలనుకున్నా ఆధార్ డీటెయిల్స్‌ అప్‌డేట్‌ చేయాలి.



'ఆధార్' ఫోటో మార్పు కోసం https://uidai.gov.in లో ఎన్ రోల్ మెంట్ ఫామ్ డౌన్ లోడ్ చేసి వివరాలు నింపిన తర్వాత ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లి ఫామ్ సమర్పించాలి



రూ.100 చెల్లిస్తే మీ కొత్త ఫోటో తీసుకుని రశీదుతో పాటు URN ఇస్తారు ఆ నెంబర్ ఆధారంగా మీ ఆధార్ కార్డు ట్రాక్ చెయ్యొచ్చు



గరిష్టంగా 90 రోజుల్లో ఫోటో అప్ డేట్ కాకపోతే సంబంధిత ఆధార్ సెంటర్ కు వెళ్లి ఫిర్యాదు చెయ్యొచ్చు