కోవిడ్19 ప్రతి రంగాన్ని కుదిపేసింది. కరోనాకు ముందు తరువాత అని చెప్పాల్సి వస్తోంది కూరగాయల కంటే రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యుల్ని భయపెడుతున్నాయి 15 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టే స్థాయిలో దేశంలో బియ్యం ధరలు నమోదయ్యాయి గతేడాది డిసెంబర్ 21న రిటైల్ ధర కిలోకి రూ.37.99 కాగా, ఈ డిసెంబర్ 20కి ధర రూ.43.51 కి చేరింది లోటు వర్షపాతం కారణంగా ఆశించిన స్థాయిలో పంట చేతికి అందక బియ్యం ధర పెరిగింది క్వింటాల్ ధర మహారాష్ట్రలో రూ.6 వేలు, ఏపీ, తెలంగాణలో రూ.5 వేల పైగా పలుకుతోంది విదేశాలకు బియ్యాన్ని పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది భారత్. ఆసియాలో అతి పెద్ద ఎక్స్‌పోర్టర్ మనమే. బియ్యం ఎగుమతిపై ఆంక్షలు విధించినా, కొందరు దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు గతేడాదితో పోల్చుకుంటే 12.7% మేర బియ్యం సేకరణ తగ్గింది, దిగుబడి సైతం తగ్గింది ధరలు తగ్గేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. త్వరలో కేజీ బియ్యం రూ.25కే విక్రయించనున్నారు