ఢిల్లీ వాసులకు కాలుష్య బాధలు తప్పడం లేదు. ప్రస్తుతానికి అక్కడ గాలి నాణ్యత 335 కి పడిపోయింది.

NCR, నోయిడాలోనూ ఎయిర్‌ క్వాలిటీ 'Very Poor' కేటగిరీలో ఉంది.

భాగ్యనగరంలో కొంత కాలుష్య ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ AQI 116 గా నమోదైంది. విశాఖలో గాలి నాణ్యత కాస్త మెరుగైంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. అక్కడ AQI 248గా నమోదైంది. గ్వాలియర్‌లో 238గా ఉంది.

Image Source: PTI

రాజస్థాన్‌లోని కోటాలోనూ కాలుష్యం కమ్మేసింది. అక్కడ ఎయిర్ క్వాలిటీ 319గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

నాగ్‌పూర్‌లో ఎయిర్ క్వాలిటీ 358గా నమోదు కాగా సోనిపట్‌లో 348 గా రికార్డ్ అయింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 0-50 గా ఉంటే ప్రమాదమేమీ లేనట్టు లెక్క. 51-100 ఉంటే Satisfactory గా పరిగణిస్తారు.

కాలుష్య స్థాయి 300 దాటిందంటే ప్రమాదకరంగా ఉన్నట్టు లెక్కిస్తారు. ప్రస్తుతం పలు కీలక నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది.

పొల్యూషన్ లెవల్ 400 క్రాస్ అయితే అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు లెక్క.