ఉత్తరాఖండ్‌లోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు క్షేమంగా బయటకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించింది దాదాపు 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి 41 మంది క్షేమంగా బయటపడ్డారు మెడికల్ టీమ్ సహాయంతో అంబులెన్సులలో కార్మికులను ఆసుపత్రికి తరలిస్తున్నారు ఉత్తరాఖండ్ సీఎం ధామి టన్నెల్ నుంచి బయటకొచ్చిన కార్మికులను పరామర్శించారు ఆపరేషన్ సక్సెస్ కావడంతో సిల్ క్యారా టన్నెల్ వద్ద స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకున్నారు టన్నెల్‌లో రెస్క్యూ వర్కర్లు కూలీలను బయటకు తీసుకురావడం కోసం తీవ్రంగా శ్రమించారు. వారి కుటుంబసభ్యులతో పాటు యావత్ దేశం కూలీలు క్షేమంగా బయట పడటంపై హర్షం వ్యక్తం చేస్తోంది అనంతరం 41 మంది కార్మికులను చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు