IAFకి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ నరేంద్ర మోదీ స్టేడియంపై ఈ ఎయిర్ షో చేసింది. స్టేడియంలోని అభిమానులు ఈ ఎయిర్ షో చూస్తూ ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్‌లు గాల్లో రకరకాల విన్యాసాలు చేస్తూ టీమిండియాకి విషెస్ చెప్పాయి. క్రికెట్ బాల్ ఆకారంలో చేసిన విన్యాసాలు ఎయిర్ షోకే హైలైట్‌గా నిలిచాయి. 1996లో సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌ని ఏర్పాటు చేశారు. IAFకి చెందిన బెస్ట్ పైలట్స్ ఈ ఎయిర్ షోలు నిర్వహిస్తారు. స్డేడియం బయట కూడా వందలాది మంది అభిమానాలు ఈ ఎయిర్ షోని చూస్తూ ఎంజాయ్ చేశారు. ఎయిర్ షో ముగిసిన తరవాత ఉత్కంఠ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. (Images Credits: ANI)