అన్వేషించండి

వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై కేసు- వర్గాల మధ్య చిచ్చు రేపారని అపవాదు

పవన్ కల్యాణ్‌పై విజయవాడలోని కృష్ణ లంక పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. అయోధ్యనగర్‌కు చెందిన దిగమంటి సురేష్‌ బాబు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వారాహి రెండో విడత యాత్రలో వాలంటీర్ల వ్యవస్థను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ టార్గెట్ చేశారు. ఆ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని కొందరు వాలంటీర్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ భగ్గుమంది. చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు అయింది. 

పవన్ కల్యాణ్‌పై విజయవాడలోని కృష్ణ లంక పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. అయోధ్యనగర్‌కు చెందిన దిగమంటి సురేష్‌ బాబు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/2023 కింద ఫిర్యాదు స్వీకరించి మూడు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. ఈ సురేష్‌బాబు అనే వ్యక్తి విజయవాడలోని 228 సచివాలయంలో పని చేస్తున్నాడు. 

సచివాలయ ఉద్యోగి సురేష్‌ బాబు ఫిర్యాదు మేరకు పవన్‌పై సెక్షన్‌ 153, 153ఏ, 505(2) కింద కేసులు పెట్టారు. ఇందులో సెక్షన్‌ 153 రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెబుతుంది. రెండోది 153 ఏ ప్రకారం రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలు చెలరేగే ఆస్కారం ఉన్నప్పుడు పెట్టే సెక్షన్. 505(2) ప్రకారం రూమర్స్‌ను ప్రచారం చేస్తే పెట్టే కేసు. ఇలా రూమర్స్ వల్ల గొడవలు జరుగుతాయని చెప్పినప్పుడు ఈ  సెక్షన్‌లో కేసు రిజిస్టర్ చేస్తారు. ఇలా మూడు సెక్షన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. 

వెనక్కి తగ్గని పవన్ కల్యాణ్

వాలంటీర్లు అందరూ తన సోదర సమానులనీ, అందరూ అక్కాచెల్లెళ్లు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తాను కలలో కూడా అనుకోబోనని చెప్పారు. అవసరమైతే వారికి వచ్చే రూ.5 వేలకు ఇంకో 5 వేలు వేసి ఇచ్చే మనసున్నవాడినని అన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్ర రెండో విడతలో పాల్గొని పవన్ కల్యాణ్ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని పవన్ ఎత్తి చూపారు.

వాలంటీర్ అంటే అర్థం.. ప్రతిఫలం ఆశించకుండా తమకు తాముగా వచ్చి సాయం చేయడం అసలు అర్థం అని అన్నారు. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థకి దేశానికి రాష్ట్రపతి ప్రెసిడెంట్‌గా ఉంటారని, రాష్ట్రాలకు గవర్నర్‌లు బాధ్యత వహిస్తారని అన్నారు. అలాంటి ఏపీలో జగన్ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరని ప్రశ్నించారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీ డేటా మొత్తం హైదరాబాద్ లోని నానక్‌రాం గూడలో ఉందని ఆరోపించారు. ఏపీకి చెందిన ప్రజల ఆధార్ డేటా మొత్తం ఓ సంస్థకు ఎందుకు అప్పగించావని నిలదీశారు. ఆ ఏజెన్సీలో పని చేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులకు ఎవరు జీతాలు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లు నేరాలకు పాల్పడిన ఘటనలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. 

గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా ఆడపిల్లలు!

ఈ వాలంటీర్ వ్యవస్థలో పుచ్చులు, కొంత మంది కుళ్లిపోయిన వ్యక్తులు, క్రిమినల్స్, కిరాతకులు ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? నీ వాలంటీర్ వ్యవస్థకు బాధ్యత తీసుకుంటారు? వాలంటీర్స్ రెక్కీలు చేస్తున్నారు. ఒంటరి ఆడపిల్లల్ని గుర్తి్స్తున్నారు. సంక్షేమ పథకాలు తీసేస్తామని వారిని బెదిరిస్తున్నారు. గద్ద కాళ్ల కింద కోడి పిల్లల్లా వాలంటీర్ల కింద ఆడపిల్లలు బలి అవుతున్నారు. ఆడ పిల్లలు లొంగకుండా ఎదురు తిరగడండి. పోలీస్ స్టేషన్లలో, అవసరమైతే కలెక్టరేట్లలో ఫిర్యాదులు చేయండి. జనసేన మీకు అండగా ఉంటుంది. "
-
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget