RRR Theatres : సాంకేతిక సమస్యతో షో రద్దు, రచ్చ రచ్చ చేసిన ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్
RRR Theatres : ఆర్ఆర్ఆర్ థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. విజయవాడలోని ఓ థియేటర్లో సాంకేతిక కారణంతో షో రద్దైంది. ఆగ్రహించిన అభిమానులు థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు.
![RRR Theatres : సాంకేతిక సమస్యతో షో రద్దు, రచ్చ రచ్చ చేసిన ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ Vijayawada Annapurna Theatre RRR show cancelled fans damaged theatre furniture RRR Theatres : సాంకేతిక సమస్యతో షో రద్దు, రచ్చ రచ్చ చేసిన ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/3f064fb99fd7324ad8d9f4240643903e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RRR Theatres : ఆర్ఆర్ఆర్ రిలీజైన థియేటర్ల వద్ద అభిమానుల(RRR Fans) కోలాహలం నెలకొంది. గురువారం రాత్రి నుంచి థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. డీజే సౌండ్స్, టపాసులతో అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ(RRR Movie) శుక్రవారం విడుదల అయింది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలవ్వడంతో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ramcharan) అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. భారీ కటౌట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఇక అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. అయితే కొన్ని చోట్ల అభిమానుల హంగామా అవధులు దాటింది. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా సాంకేతిక కారణాలతో రద్దు అయింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో థియేటర్ అద్దాలు ధ్వంసం(Theatre Furniture Damage) చేశారు.
Fans Attack Annapurna Theatre in Vijayawada | షో సమయంలో సాంకేతిక లోపం... ఫ్యాన్స్ ఆగ్రహం | @ABPDesam#RRRMovie #VijayawadaAnnapurnaTheatre #Vijayawada pic.twitter.com/2Ztiwe4xbO
— ABP Desam (@ABPDesam) March 25, 2022
గన్ తో అభిమాని హల్ చల్
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ థియేటర్ లో గన్(Gun) తో అభిమాని హల్చల్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ బయట గన్ తో ఫోజులు ఇచ్చారు. సినిమా థియేటర్ లో తెరముందు గన్ తో తిరుగుతూ కేరింతలు కొట్టాడు. అది నిజం తుపాకినా లేక డమ్మినా తెలియక అభిమానులు ఆందోళన చెందారు. గన్ తో హల్చల్ చేసిన వ్యక్తి పిఠాపురానికి చెందిన విశ్వహిందూ పరిషత్ కు సంబంధించిన వ్యక్తి అని తెలుస్తోంది.
#RRRMovie Fans Turnup Huge at Srikakulam District Narasannapeta | Fans ను కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులు#Srikakulam #RRRReview #FansHungama pic.twitter.com/e906nDbi03
— ABP Desam (@ABPDesam) March 25, 2022
థియేటర్ యాజమాన్యం, ఫ్యాన్స్ మధ్య తోపులాట
కరీంనగర్ మమత థియేటర్ వద్ద RRR సినిమా షోకి ముందు తోపులాట జరిగింది. థియేటర్ యాజమాన్యం ఫ్యాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించి కొట్టారని జిల్లా NTR ఫాన్స్ అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్ ఆరోపించారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు థియేటర్ వద్దకు వచ్చారు. అనంతరం ఇరువర్గాల మధ్య గొడవ సద్దుమణిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)