Vijaysai Reddy : ఈ సారి పక్కాగా పదవి - విజయసాయిరెడ్డికి రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ పోస్టు ఖరారు!
విజయసాయిరెడ్డికి రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ పదవిని ఉపరాష్ట్రపతి ఖరారు చేశారు. ఉపరాష్ట్రపతి, ప్రధానిలకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Vijaysai Reddy : వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయనను రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ గా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు పీటీ ఉషను కూడా ప్యానల్ రాజ్యసభ వైస్ చైర్మన్ గా నియమించారు. ఈ నియామకం 19వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాజ్యసభ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాపై అచంచల విశ్వాసంతో రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించిన ఉపరాష్ట్రపతి,ప్రధానిలకు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా నావంతు కృషిచేస్తానన్నారు.
నాపై అచంచల విశ్వాసంతో రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించిన ఛైర్మన్ శ్రీ @jdhankhar1 గారికి, ప్రధాని శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా బాధ్యతను అత్యంత ధర్మనిష్టతో నెరవేరుస్తానని విన్నవించుకుంటున్నా. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా నావంతు కృషిచేస్తా. pic.twitter.com/Bw9GCdpBkg
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 20, 2022
నిజానికి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు..ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను ప్రకటించారు. ముందుగా ఎనిమిదో పేరుగా విజయ సాయిరెడ్డి పేరు ఉంది. రాజ్యసభ కార్యాలయం నుంచి విజయసాయిరెడ్డికి సమాచారం కూడా వచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ వెబ్‌సైట్‌లో ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను పెట్టినప్పుడు ఎనిమిదో పేరుగా విజయసాయిరెడ్డిని ప్రస్తావించారు. దీనికి ఆయన కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
కానీ అధికారికంగా రాజ్యసభలో ఉపరాష్ట్రపతి ప్రకటించలేదు. విజయసాయి రెడ్డిని రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో మొదట చేర్చిన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అనూహ్యంగా తొలగించారు. ప్యానల్ వైఎస్ చైర్మన్ జాబితాను పునర్‌వ్యవస్థీకరించామని చెప్పి ఏడు పేర్లే ప్రకటించారు. ఎనిమిదో పేరుగా ఉన్న విజయసాయిరెడ్డి పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆయన పేరు తొలగించినట్లు అయింది.
మొదట ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు చెబుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి.. ఆ తర్వాత తన పేరు ప్రకటించకపోవడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే చివరి క్షణంలో విజయసాయిరెడ్డి పేరును రాజ్యసభ చైర్మన్ ఎందుకు తొలగించారన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉన్న సమయంలో మళ్లీ ఆయనను నియమించడం చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి తీరుపై పలువురు ఫిర్యాదు చేయడంతోనే.. మొదట ఆయన పేరును తొలగించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి విజయసాయిరెడ్డి పేరును ధన్ ఖడ్ జాబితాలో చేర్చారు. తనపై వచ్చన ఆరోపణల విషయంలో ఆయన ఉపరాష్ట్రపతికి క్లారిటీ ఇచ్చినట్లుగా గా చెబుతున్నారు.
ప్రభుత్వాలకు తొత్తులుగా పోలీసులు, నిజాలు మాట్లాడితే ఉద్యోగాలు పోతాయ్ - మోహన్ బాబు సంచలనం