News
News
X

Mohan Babu: ప్రభుత్వాలకు తొత్తులుగా పోలీసులు, నిజాలు మాట్లాడితే ఉద్యోగాలు పోతాయ్ - మోహన్ బాబు సంచలనం

పోలీసు శాఖ‌ అంటే తాను ఎంత గానో గౌరవిస్తానని, సమాజంలో నిజాలన్నీ పోలీసులకే తెలుస్తాయని మోహన్ బాబు అన్నారు. కింది స్థాయి పోలీసులు నిజాలు మాట్లాడితే వారి ఉద్యోగాలు ఊడిపోతాయని అన్నారు.

FOLLOW US: 
Share:

ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులు తొత్తులుగా మారిపోయారని సినీ నటుడు మంచు‌ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన లాఠీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మంచు మోహన్ బాబు ముఖ్య అతిధిగా హజరైయ్యారు. ఈ సందర్భంగానే కొందరు పోలీసు ఉన్నతాధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడు, ఎనిమిది సంవత్సరాల నుంచి తాను ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాలేదని విశాల్ ఫోన్ చేసిన వెంటనే తిరుపతికి రావడం వచ్చానని అన్నారు. విశాల్ చేసిన 32 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయని చెప్పిన ఆయన, శ్రీవారి పాదాలు, షిరిడి సాయిబాబా సాక్షిగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించబోతుందని కొనియాడారు.

ధర్మరాజు ఎంఏ సినిమా విశాల్ తండ్రితో చేసిన జ్ఞాపకాలను మోహన్ బాబు గుర్తు చేశారు.. విశాల్ కు ఒక పొగరు ఉందని ఆ పొగరుతోనే అద్భుత చిత్రాలను తీస్తున్నారని చెప్పారు.. విశాల్ ఈ చిత్రం వెనుక ఓ కానిస్టేబుల్ కథ ఉంటుందని పోలీసులంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.. పోలీసులకే మొదట నిజాలు తెలుస్తాయని అయితే రాజకీయ పరంగా చూస్తే రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం పాలనలో ఉంటుందో ఆ పాలకులకు పోలీసులు మద్దతు పలుకుతారని, లేకుంటే ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం కూడా ఉంటోందని అన్నారు.. విశాల్ ఎంతో గొప్ప హీరో కావాలని ఆయన ఆకాంక్షించారు.. ప్రభుత్వాలకు పోలీసు ఉన్నతాధికారులు తొత్తులుగా మారిపోయారని విమర్శించారు.. పోలీసు శాఖ‌ అంటే తాను ఎంత గానో గౌరవిస్తానని, సమాజంలో నిజాలన్నీ పోలీసులకే తెలుస్తుందని అన్నారు. అయితే కింది స్థాయి పోలీసులు నిజాలు మాట్లాడితే వారి ఉద్యోగాలు ఊడిపోతాయని అన్నారు. ఇక ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ప్రభుత్వాలకు కొమ్ము కాయడం తనను ఎంత గానో బాధకు గురి చేస్తుందని మంచు మోహన్ బాబు అన్నారు.

విశాల్‌ కూడా సీరియస్ కామెంట్స్  

ఏపీ సీఎం వైయస్ జగన్ అంటే తనకు చాలా ఇష్టమని ఐ లవ్ జగన్ అని హీరో విశాల్ అన్నారు. లాఠీ సినిమా ప్రమోషన్ లో భాగంగా తిరుపతి వచ్చిన విశాల్ తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్న ప్రచారాన్ని ఖండించారు. తన తండ్రి కుప్పంలో వ్యాపారం చేసే వారిని సినిమాల్లోకి రాక ముందు తండ్రికి సాయంగా కుప్పంలోనే ఉండేవాడినని తెలిపారు. కుప్పంలో ప్రతి వీధి తనకు బాగా తెలుసని అన్నారు. తనకు ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంపాదన, ఎక్కువ ప్రజాభిమానం ఉందని అన్నారు. తాను ఏపీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. లాఠీ సినిమా ప్రతి టికెట్ ఆదాయంలో ఒక రూపాయి పక్కన పెట్టి రైతులకు సాయం చేస్తానని తెలిపారు. సోషల్ సర్వీస్ చేసే ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడేనని,  అలా తాను ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. 

పోటీ అంటే హీరోలతోనే 

"నటుడు కాక ముందు కుప్పంలో పనిచేశాను. మా నాన్న కాంట్రాక్టర్ గా ఉన్నప్పుడు కుప్పంలో ప్రతి వీధి తిరిగాను. నేను కుప్పం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజకీయాలంటే సోషల్ సర్వీస్ అన్నారు. అందరం పొలిటీషియన్సే అన్నారు. సాయం చేసే ప్రతీ వ్యక్తి పొలిటీషియన్స్ అన్నారు. లాఠీ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో టికెట్ పై ఒక రూపాయి రైతులకు సాయం చేస్తాను. ఈ సినిమాను అందరి కానిస్టేబుల్ కుటుంబాలకు చూపించాలని కోరిక. ఐ లవ్ జగన్. భవిష్యత్ లో ఏపీ నుంచి పోటీ చేయనన్నారు. పోటీ అంటే హీరోలతోనే అన్నారు. అందరూ మెచ్చుకునే సినీ పరిశ్రమలో ఉన్నాను. ఇంతటి అభిమానాన్ని నేను కోల్పోలేను. ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అభిమానాన్ని నేను సంపాధించుకున్నాను." - హీరో విశాల్  

చంద్రబాబుపై పోటీ 

 

తమిళంలో హీరోగా నిలదొక్కుకున్న తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారని, కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని విశాల్ గతంలో కూడా ఖండించారు. రాజకీయాల్లోకి వచ్చే  ఆలోచన లేదన్నారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని, అయినా ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదన్నారు. తన ప్రాధాన్యం సినిమాలకు మాత్రమేనన్నారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబుపై పోటీ చేసే ఉద్దేశంలేదన్నారు. నెల్లూరుకు చెందిన విశాల్ రెడ్డి కుటుంబం చెన్నైలో స్థిరపడింది.  ఆ కుటుంబానికి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. 

Published at : 20 Dec 2022 12:26 PM (IST) Tags: Mohan Babu Hyderabad Police Mohan babu comments lotty pre release event Lotty movie

సంబంధిత కథనాలు

Minister Roja On Lokesh : లోకేశ్ అంకుల్ చేస్తుంది యువగళం కాదు ఒంటరిగళం, మంత్రి రోజా సెటైర్లు

Minister Roja On Lokesh : లోకేశ్ అంకుల్ చేస్తుంది యువగళం కాదు ఒంటరిగళం, మంత్రి రోజా సెటైర్లు

విశాఖలో సీఎం జగన్ నివాసం అక్కడేనా ?

విశాఖలో సీఎం జగన్  నివాసం అక్కడేనా ?

TTD News: ప్రతీ బుధవారం బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారంటే?

TTD News: ప్రతీ బుధవారం బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారంటే?

ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?

ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?

AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ

AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ

టాప్ స్టోరీస్

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?