అన్వేషించండి

Nellore YSRCP : నెల్లూరు సిటీ సీటుపై మళ్లీ రచ్చ - అనిల్ మాటకే సీఎం జగన్ ప్రాధాన్యం - వేమిరెడ్డి అసంతృప్తి

YSRCP Nellore : నెల్లూరు సిటీ అసెంబ్లీ టిక్కెట్ తన సతీమణికి కేటాయించకపోవడంపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. మాజీ మంత్రి అనిల్ చెప్పిన వారినే సమన్వయకర్తగా నియమించారు.

YSRCP Nellore Politics : నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  మాజీ మంత్రి అనిల్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వొద్దని పట్టుబట్టిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. అనిల్ కుమార్ ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నెల్లూరు సిటీ అభ్యర్థిగా మాత్రం అనిల్ సూచించిన  ఖలీల్ అహ్మద్ ను నియోజకవర్గ ఇంచార్జుగా నియమించారు. ఖలీల్ అహ్మద్.. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రధాన అనుచరుడు. సమన్వయకర్తగా ప్రకటించగానే అనిల్ తో కలిసి ఆయన సీఎం జగన్ ను కలిశారు. 

అనిల్ కుమార్ యాదవ్ వల్లే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ సంతోషం  వ్యక్తం చేస్తున్నారు.  తనను నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషంగా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. ”నాకు ఈ టికెట్ రావడం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కృషి ఎంతో ఉంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు లేవు. వైఎస్ఆర్ కాంగెస్ నాయకులమంతా కలిసే ఉన్నాం. మేమంతా కలిసి పని చేస్తాం. జగన్‌ను మళ్లీ సీఎం చేస్తామ”ని ఎండీ ఖలీల్ అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఖలీల్ ను ఎంపిక చేయడాన్ని నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి  కూడా స్వాగతించారు.

కానీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం అసంతృప్తికి గురయ్యారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేయనున్నారు.  నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్నారు వేమిరెడ్డి. వేమిరెడ్డి తన సతీమణి ప్రశాంతి రెడ్డి కి  టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఒక  వేళ మైనార్టీకి ఇవ్వాలనుకుంటే  మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్‌కు ఇవ్వాలని సిఫారసు చేశారు. అయితే సీఎం జగన్ మాత్రం అనిల్  కుమార్ చెప్పిన నేతకే ప్రయారిటీ ఇచ్చారు. తాను చెప్పింది వైసీపీలో జరగకపోవడంతో మనస్తాపం చెందారు. ఆయన పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు.

వేమిరెడ్డి సీఎం జగన్ కు ఉన్న అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న ఆయన.. వైసీపీ కోసం నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషిస్తారని అంటారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఏప్రిల్ లో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. మళ్లీ ఆయనను రాజ్యసభకు పంపకుండా.. పార్లమెంట్ కు పోటీ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంచార్జ్ గా నియమించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
Embed widget