Top 5 Headlines Today: పవన్ కల్యాణ్ కు మంత్రి బొత్స ట్యూషన్స్! కాంగ్రెస్ నేతల సమావేశంలో చర్చించే అంశాలివే!
Top 5 Telugu Headlines Today 23 July 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 23 July 2023:
డియర్ పవన్ కల్యాణ్ నీకు ట్యూషన్స్ చెప్తా, ఈ హోంవర్క్ చెయ్ - బొత్స సెటైరికల్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ అనే ఎడ్‌టెక్ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్క టీచర్ ని కూడా రిక్రూట్ చేయలేదని గుర్తు చేశారు. ఇవన్నీ చేయకుండా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఉన్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. బైజూస్‌కు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా? అని ప్రశ్నించారు. అసలు ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారనే వివరాలు పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయా? అని పవన్ కల్యాణ్ నిలదీస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు
జోనల్ సమావేశాల్లో చిన్నమ్మ బిజీ బిజీ, ప్రొద్దుటూరు నుంచి శ్రీకారం
రాష్ట్రంలో జోనల్ వారీగా సమావేశాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు నుండి సమావేశాలకు ఆమె శ్రీకారం చుట్టారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తరువాత దగ్గుబాటి పురంధేశ్వరి జోన్ ల వారీగా పర్యటనలకు సిద్దం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె ఆయాప్రాంతాల్లో పర్యటనలు చేపట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జోనల్ సమావేశాల్లో పురంధేశ్వరి బిజీ బిజీగా ఉన్నారు. పూర్తి వివరాలు
నేడు కాంగ్రెస్ నేతల కీలక సమావేశం, చర్చించే అంశాలు ఇవే!
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోతోంది. అందులో భాగంగా సమావేశాలు పెట్టుకొని రాజకీయ పరంగా వ్యూహాలు తయారు చేసుకుంటున్నారు. నేడు (జూలై 23) కాంగ్రెస్ నేతల పీఏసీ (రాజకీయ వ్యవహారాలు కమిటీ) కీలక భేటీ గాంధీ భవన్ లో జరగనుంది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అంతర్గత సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ పీసీసీ నేతల పీఏసీ మీటింగ్ జరగనుంది. పూర్తి వివరాలు
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం, రాజ్‌భవన్‌లో కార్యక్రమానికి కేసీఆర్ హాజరు
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై జస్టిస్ అలోక్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాజ్ భవన్‌కు వెళ్లారు. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణకు వచ్చారు. పూర్తి వివరాలు
విభిన్నంగా చంద్రబాబు ప్రచార వ్యూహం - ఎన్నికల కోసం పక్కాగా రెడీ అవుతున్న టీడీపీ !
ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. తెలంగాణతో పాటు ఎన్నికలు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది సీఎం జగన్ చాయిస్. ఆయన మాత్రం మైండ్ గేమ్ కు పాల్పడుతున్నారని.. ముందస్తు ఆలోచనే లేదని పార్టీ నేతలకు చెబుతున్నారు. అయినా సరే.. ఆ తర్వాత మరో ఐదు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నందున ఆ వేడి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర వచ్చే ఏడాది వరకూ సాగనుంది. చంద్రబాబు కూడా మరో వైపు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. పూర్తి వివరాలు