Top 5 Headlines Today: వైసీపీలో వర్గపోరుపై సీఎం జగన్ ఫోకస్! కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమారుడిపై హత్యాయత్నం కేసు!
Top 5 Telugu Headlines Today 18 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
పవన్‌ను నమ్ముకున్న నిర్మాతలు సూసైడ్ చేసుకునేలా ఉన్నారు - ఎమ్మెల్యే అనిల్
సీఐ అంజూ యాదవ్ విషయంలో పవన్ కల్యాణ్ వైఖరిపై మరోసారి మండిపడ్డారు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. విధి నిర్వహణలో మహిళా సీఐ చేసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన సీఐ ఆందళనకారులకు బుద్ధి చెబితే, పవన్ యువతను రెచ్చగొడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి మహిళా సీఐ బుద్ధి చెబితే పవన్ కి నొప్పేంటని అన్నారు. నిలకడలేని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ప్రజలు పవన్ గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు
అంజన్ కుమార్ యాదవ్ కుమారుడిపై హత్యాయత్నం కేస్
హుస్సేనీఅలాం పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్‌పై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు.ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. హుస్సేనీఆలాంలో నివాసం ఉండే గొల్లకిడ్కీలో పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఇది కాస్త కొట్టుకునే వరకు వెళ్లింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ప్రకాష్ యాదవ్, మధుకర్ యాదవన్ అనే ఇద్దరు వ్యక్తులను అరవింద్‌కుమార్ యాదవ్ కొట్టారు. వీళ్లిద్దరు నైబర్సే కాకుండా అరవింద్‌కు దూరపు బంధువులు అనే అంటున్నారు. పూర్తి వివరాలు
వైఎస్ఆర్‌సీపీలో వర్గపోరుపై సీఎం జగన్ దృష్టి - తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు పిల్లి సుభాష్ !
స్ఆర్‌సీపీలో అంతర్గత విబేధాలు అంతకంతకూ పెరిగిపోతూండటంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. టిక్కెట్ల కోసం రేసులో ఉన్న నేతలు నియోజకవర్గాల్ని పంచుకుంటున్నారు. తాము పోటీ చేస్తామంటే.. తాము పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. అాలాగే డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో కూడా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ మధ్య రగడ ప్రారంభమయింది. ఇది దాడుల వరకూ దారి తీయడం.. పిల్లి సుభాష్ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో హైకమాండ్ అప్రమత్తమయింది. గోదావరి జిల్లా ఇంచార్జ్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల మూడు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో ఉన్నప్పటికీ సుభాష్ ఆయనను కలిసేందుకు రాలేదు. దీంతో పరిస్థితి చేయి దాటకుండా సీఎం జగన్ ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాలు
ఆంధ్రా యూనివర్శిటీలో లైంగిక వేధింపుల కలకలం - కేసులో లిక్కర్ కిక్ కూడా !
ఆంధ్రా యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వస్తున్న ఆరోపణల వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్ సత్య నారాయణ పై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. జాతీయ మహిళా కమిషన్ కు రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఫిర్యాదు చేశారు. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని, 75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు లో సోనాలి పేర్కొన్నారు. పూర్తి వివరాలు
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కేసు విచారణ సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా పడింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీతా రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన కేంద్రదర్యాప్తు సంస్థ వివేక హత్య కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని రిక్వస్ట్ చేసింది. దీంతో కేసును సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలు
ఢిల్లీ, బెంగళూరులో కీలక పరిణామాలు- తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ ఒక్కరే హాజరు
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు పది నెలల సమయమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన విపక్షాలు పాట్నా సమావేశం తర్వాత ఈసారి బెంగళూరులో ఒక్కటయ్యాయి. సోమవారం (జూలై 2024) విందుతోపాటు ఎన్నికలపై విపక్ష నేతలు మేధోమథనం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షతన విపక్షాల రెండో సమావేశం జరుగుతోంది. పూర్తి వివరాలు