By: ABP Desam | Updated at : 03 Jun 2023 03:07 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన డిల్లీకి చేరుకుని సాయంత్రం అమిత్ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. శనివారం ఉదయం వరకూ ఆయన ఢిల్లీ పర్యటన గురించి సీక్రెట్ గానే ఉంది. ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అధికార పదవల్లో లేరు కాబట్టి అధికారిక విషయాలు చర్చించే అవకాశం లేదు. కేవలం రాజకీయ అంశాలపై మాత్రమే చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానించే ఉద్దేశంలో అమిత్ షా, మోదీ ఉన్నారని చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనలో 288 మంది మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఘోర ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, తీవ్ర గాయాల పాలు కావడం తనను కలిచి వేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోని వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన ఈ విచారణకు హాజరయ్యారు.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి
తెలంగాణ సహా ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరిపేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల గడువు ముగియనుంది. ఈ ఏడాది చవరి నాటికి ఈ ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే అధికారులు బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులు ఎవరూ తమ సొంత జిల్లాల్లో పని చేయకుండా చూడాలాని ఆదేశించింది. అలాగే గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల నుంచి ఒకే జిల్లాలో పని చేస్తున్న వారిని, 2024 జనవరి 31వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్న వారిని సైతం బదిలీ చేయాలని సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 238 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. ఈఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
Janasena : వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట - తప్పులు చేస్తే అధికారుల బలైపోతారని నాగబాబు హెచ్చరిక !
Chandrababu custody : 50 ప్రశ్నలు - ముగిసిన చంద్రబాబు తొలి రోజు సీఐడీ కస్టడీ !
TDP News : కర్నూలు టీడీపీలో కీలక మార్పులు - బైరెడ్డి చేరిక ఖాయమయిందా ?
Visakha Vandanam: విజయదశమికే విశాఖ నుంచి పాలన, స్వాగత ఏర్పాట్లు చేయనున్న నాన్ పొలిటికల్ జేఏసీ
మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి, గన్ మిస్ ఫైర్
Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!
Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం
/body>