అన్వేషించండి

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో సాయం చేసేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 238 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. ఈఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి.. ఈ  ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుుకన్నారు. తాజా సమాచారం ప్రకారం 238 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు.

సీఎం ఆదేశాలమేరకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని డీఆర్ఎం అధికారి నుంచి సమాచారం తెప్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక బృందాన్ని ప్రమాదం జరిగిన బాలాసోర్‌ ప్రాంతానికి పంపించాలని సీఎం ఆదేశించారు. 

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, విశాఖలో కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆనంద్‌, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌తో కూడిన బృందం వెళ్తోందని అధికారులు తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటుచేయాలని అధికారులు తెలిపారు. 

రైల్వే అధికారుల నుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరా తీయడానికి, అలాగే ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పని చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో పాటు ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్‌లు పంపించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని కూడా ఆదేశించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. 

ఒడిశా రైలు ప్రమాదంపై వివరాలకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు  విజయవాడ,రాజమండ్రి లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

విజయవాడకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
Rly -67055
BSNL- 0866 2576924

రాజమండ్రికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
BSNL: 08832420541
RLY: 65395

దక్షిణ మధ్య రైల్వే హెడ్‌ క్వార్టర్, సికింద్రాబాద్: 040 - 27788516
విజయవాడ : 0866-2576924
రాజమండ్రి : 0883-2420541 
సామర్లకోట: 7780741268
ఏలూరు: 08812-232267
తాడేపల్లిగూడెం: 08818-226212
బాపట్ల: 08643-222178
తెనాలి: 08644-227

ఒడిశాలో సంతాప దినం

బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక రోజు సంతాప దినం పాటించాలని ఆదేశించారు. జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

తమిళనాడులో సంతాపదినం 

తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సంతాప దినం ప్రకటించింది. వేడుకలను నిషేధించింది. 

వందేభారత్‌ ప్రారంభోత్సవం వాయిదా

ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రధాని కార్యక్రమాలను కూడా మార్చేశారు. ముంబై-గోవాకు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అది వాయిదా పడింది.

 ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్‌ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget