Top News: తన అరెస్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - తెలంగాణ ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top News In AP And Telangana:
1. తన అరెస్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. తొలి గెస్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి పలు ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. బాలయ్య, చంద్రబాబు మొదట ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది కలికాలం బావా.. నాడు ద్వాపర యుగంలో బామ్మర్ది భగవద్గీత చెబితే బావ విన్నాడు. ఇప్పుడు బావ చెబితే బామ్మర్ది వింటున్నాడంటూ బాలయ్య నవ్వులు పూయించారు. చంద్రబాబు అనే నేను బాలకృష్ణపై ప్రేమతో, మర్యాదగా, సమయస్ఫూర్తితో సమాధానం చెబుతానని ప్రమాణం చేయించారు. మీ చమత్కారం మీది మా సమయస్ఫూర్తి మాదని చంద్రబాబు అన్నారు. ఇంకా చదవండి.
2. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
పలాస నియోజకవర్గంలో రాజకీయ కక్షలు తారాస్థాయికి చేరాయి. కాశీబుగ్గ పోలీసు స్టేషను లో వైసిపి నేతలపై టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు వైసిపి నేత అల్లు రమణపై టీడీపీ వర్గీయులు శనివారం హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దాడి నుండి తప్పించుకున్న అల్లు రమణ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కాశీబుగ్గ స్టేషనుకు వెళ్ళారు. తనపై దాడికి ప్రయత్నించిన కత్తితో పాటు వెళ్లి ఫిర్యాదు చేయడానికి స్టేషను కు వచ్చిన వైసిపి నేతలు అల్లు రమణ, మొదలవలస మన్మదరావులపై టీడీపీ నేతలు ఇష్టారీతిన దాడి చేయడం కలకలం రేపుతోంది. ఇంకా చదవండి.
3. విశాఖ - విజయవాడ మధ్య విమాన సర్వీసులు
ఏపీలో కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం- విజయవాడ మధ్య రెండు విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రారంభించింది. విశాఖపట్నంలోని విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) సర్వీసు విశాఖ ఎయిర్ పోర్టులో ఉదయం 9:35కు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరకుంటుందని అధికారులు తెలిపారు. ఇంకా చదవండి.
4. ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడం మాత్రమే మరెన్నో సేవలు అందిస్తోంది. తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ విస్తరించింది. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంకా చదవండి.
5. తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం
ఉద్యోగులకు కేవలం ఒక్క విడుత కరువు భత్యం (DA) విడుదల చేస్తామని చెప్పి దీపావళి కానుకగా చిత్రీకరించండం హాస్యాస్పదమని ఉద్యోగసంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ అన్నారు. రెండు జాక్ లతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 3 డీఏలు చెల్లిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ తెలంగాణ కేబినెట్ కేవలం ఒక్క డీఏ విడుదల చేయడం ఉద్యోగులను అవమానించడమే అన్నారు. ఇంకా చదవండి.