Vizag Vijayawada Flights: విశాఖ- విజయవాడ మధ్య 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు
vijayawada to Vizag air india express service | విజయవాడ, విశాఖపట్నం మధ్య రెండు కొత్త విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు ప్రారంభించింది. దాంతో మొత్తం సర్వీసులు మూడుకు చేరాయి.
![Vizag Vijayawada Flights: విశాఖ- విజయవాడ మధ్య 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు Ram Mohan Naidu begins Vizag to vijayawada air india express service Vizag Vijayawada Flights: విశాఖ- విజయవాడ మధ్య 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/27/90f1ec6e2bd2361cdef0316ef60dda511730003036116233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vizag to vijayawada air india express service | విశాఖపట్నం: ఏపీలో కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం- విజయవాడ మధ్య రెండు విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రారంభించింది. విశాఖపట్నంలోని విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) సర్వీసు విశాఖ ఎయిర్ పోర్టులో ఉదయం 9:35కు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరకుంటుందని అధికారులు తెలిపారు. తిరిగి అదే విమానం రాత్రి 7:55 గంటలకు విజయవాడ గన్నవరం విమనాశ్రయంలో బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుతుంది.
ఇండిగో విమానం విజయవాడలో రాత్రి 7:15 గంటలకు బయలుదేరి 8:20కి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుతుందని అధికారులు తెలిపారు. అదే ఇండిగో సర్వీసు తిరిగి విశాఖలో రాత్రి 8:45 గంటలకు బయలుదేరి విజయవాడకు 9:50కి చేరుతుంది. ఈ కొత్త విమాన సర్వీసులతో కలిపి విశాఖ- విజయవాడ మధ్య తిరిగే సర్వీసులు 3కు చేరాయి. గతంలో ఒక్క విమాన సర్వీసు మాత్రమే అందుబాటులో ఉండేది.
ప్రజా రాజధాని అమరావతి - ఆర్థిక రాజధాని విశాఖపట్నం మధ్య అనుసంధానాన్ని మరింత పెంచడం ఆనందంగా ఉంది. ఇందులో భాగంగా కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై, 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు… pic.twitter.com/CdtbPDEhmy
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) October 27, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)