News
News
వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today: బాలినేని రాజీనామా - రజనీకాంత్‌కు రోజా కౌంటర్ ! రాజాసింగ్ క్లారిటీ ! టాప్ హెడ్ లైన్స్ ఇలా

Top 5 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ ఇవీ..

FOLLOW US: 
Share:

Top 5 Headlines Today:  వైఎస్ వల్లే తెలుగు వారికి విదేశాల్లో ఉద్యోగాలు - రజనీకాంత్‌కు రోజా కౌంటర్ ! 
Roja On Rajinikanth :    2024  ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవుతుందని.. ఎన్టీఆర్ ఆశీస్సులు చంద్రబాబుకు ఉంటాయని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదన్నారు.  ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.                             

చంద్రబాబు గురించి  ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు రజనీకాంత్‌కు ఇస్తానన్న రోజా 

చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తానని రోజా ప్రకటించారు.  ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీ మాట్లాడారనా విమర్శించారు..  చంద్రబాబు విజన్‌, హైదరాబాద్‌ అభివృద్ధిపై రజనీ చేసిన  వ్యాఖ్యలపైనా స్పందించారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డే అన్నారు.. దానికి కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్‌ తెలుసుకోవాలని సూచించారు మంత్రి రోజా. ఇంకా చదవండి 

వైసీపీలో పదవులకు బాలినేని రాజీనామా - పార్టీకీ గుడ్ బై చెబుతారా?
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.  .  చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని.. తనకు ఆ బాధ్యతలు వద్దని పార్ట అధ్యక్షుడిగా స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం   హైదరాబాద్‌లో ఉన్న  బాలినేనిని సంప్రదించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్నానని డిస్టర్బ్ చేయవద్దని ఆయన అంటున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.  ఆయన రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.  

సీఎం వైఎస్ జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి తర్వాత ఉద్వాసన పలికారు.  ఆ తర్వాత పార్టీ బాధ్యతలను అప్పగించారు.. కొన్ని సందర్భాల్లో మినహా.. పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా ఉన్న బాలినేని ఉన్నట్టుండి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు వైసీపీలో ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్‌తో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తనను తొలగించి ఆయనను మంత్రిగా కొనసాగించడంపై బాలినేని .. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దానికి తోడు పార్టీ వ్యవహారాల్లో అసలు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఫీలవుతున్నారు. ఇంకా చదవండి 

Rajasingh : వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ - రాజాసింగ్ క్లారిటీ !

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.  తాను ఎట్టి పరిస్థితిలో టిడిపి పార్టీలో చేరే లేదని స్పష్టంచేశారు .తాను బిజెపి పార్టీలో ఉంటానని రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీ నుంచే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరో సారి పోటీ చేస్తానన్నారు. నా మెంటాలిటీ కి బీజేపీ తప్ప ఏ పార్టీ లు షూట్ కావు… ఎవరు తీసుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్ళలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు తన వెనుక ఉన్నారని రాజాసింగ్‌ తెలిపారు. అయితే ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసి ఆరు నెలలు దాటిపోయింది. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా సస్పెన్షన్ వేటు ఎత్తి వేయడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి పోటీ చేయాలంటే... సస్పెన్షన్ వేటువేసినందున బీజేపీ టిక్కెట్ ఇవ్వదని అనుకుంటున్నారు. అందుకే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. 

టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాజాసింగ్    

రాజాసింగ్‌ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌గౌడ్‌పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంకా చదవండి

నెల రోజులు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా అందలేదు: షర్మిల 

Sharmila Tour: అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు ఎకరాకు 30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తే ఏ మూలకు సరిపోవని, రైతులు ప్రతి ఎకరాకు రూ. 30 వేల చొప్పున ఖర్చు పెట్టారని షర్మిల తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటను షర్మిల పరిశీలించారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నదని రైతులు షర్మిలకు తెలిపారు. చేతికొచ్చిన వరి పంట పూర్తి నేల పాలయ్యిందని షర్మిలతో చెప్పుకుంటూ ఆవేదన చెందారు. 

జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని షర్మిల అన్నారు. చేతికొచ్చిన పంట మొత్తం నేల పాలయ్యిందని పేర్కొన్నారు. రైతులు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఒక్క బచ్చన్న పేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తున్నట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలతో ఇంత పంట నష్టపోతున్నా కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. గత నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారని, ఎకరాకు 10 వేల రూపాయల సహాయం చేస్తామని హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. 10 వేలు ఇస్తామని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా అందలేదని షర్మిల విమర్శలు గుప్పించారు. ఇంకా చదవండి

Published at : 29 Apr 2023 03:19 PM (IST) Tags: YSRCP AP Latest news Telugu News Today BRS TDP Telangana LAtest News

సంబంధిత కథనాలు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

TTD News: శ్రీవారి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: శ్రీవారి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి

Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి

టాప్ స్టోరీస్

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత