Tirumala Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Tirupati Laddu: తిరుమల తిరుపతి లడ్డూ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ పడింది.
Tirumala News: తిరుపతి దేవుని లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న వివాదం సంచలనంగాన మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదంపై వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను హైకోర్టు ధర్మాసనం వద్ద మెన్షన్ ప్రస్తావించారు.
ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారించాలని కోరారు. దీనిపై బుధవారం వాదన వింటామని ధర్మాసనం చెప్పింది.
తిరుమల లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టు ధర్మాసనం వద్ద మెన్షన్ చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులు
— YSR Congress Party (@YSRCParty) September 20, 2024
ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని ముఖ్యమంత్రి @ncbn చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని…