TTD Updates: శ్రీవారి దర్శనం కోసం అలా వెళ్తే మోసపోవడమే! ఇలా చేస్తే చాలా సేఫ్
భువనగిరికి చెందిన 11 మంది భక్తుల వద్ద నుంచి స్వామి వారి దర్శనం కల్పిస్తాం అంటూ రూ.16,500 బేరం కుదుర్చుకుని.. ముందస్తుగా రూ.8 వేలు వసూలు చేశారు ఇద్దరు దళారులు.
కలియుగ వైకుంఠనాధుడు తిరుమల శ్రీనివాసుడు. ఒక్క క్షణం పాటు స్వామి వారిని దర్శించుకుంటే చాలు జన్మ తరించనట్లేనని భక్తులు భావిస్తారు. ఈ విశ్వాసాన్నే ఆసరాగా తీసుకుని భక్తులను మోసం చేస్తున్నారు దళారులు. దొంగ టికెట్లు, స్పామ్ మెసేజ్‌లతో భక్తులను నిలువు దోపిడీ చేశారు. ఏకంగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయం పేరు మీదనే మెసేజ్ వచ్చినట్లు.. నకిలీ మెసేజ్‌లు క్రియేట్ చేసి.. భక్తుల నుంచి వేల రూపాయలు దండుకుంటున్నారు.
తాజాగా భువనగిరికి చెందిన 11 మంది భక్తుల వద్ద నుంచి స్వామి వారి దర్శనం కల్పిస్తాం అంటూ రూ.16,500 బేరం కుదుర్చుకుని.. ముందస్తుగా రూ.8 వేలు వసూలు చేశారు ఇద్దరు దళారులు. నకిలీ మెసేజ్ లతో టికెట్ ల కోసం ఛైర్మన్ కార్యాలయానికి చేరుకున్న భక్తులు.. తాము మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు దందా బయటపడింది.
Also Read: "దళిత బంధు"కు చట్టబద్ధత .. రేపట్నుంచే తెలంగాణ అసెంబ్లీ !
కేవలం ఇదనే కాదు.. టీటీడీ ఉద్యోగులం టికెట్ లు ఇప్పిస్తామని భక్తులను ట్రాప్ చేయటం, తితిదే పేరు మీదనే నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి మోసాలు చేయటం, సమాచారం లేక దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చిన భక్తులను వంచించటం ఇటీవలి కాలం లో సాధారణమై పోయింది. రోజుకో కొత్త పద్దతిలో మోసాలకు పాల్పడుతున్న దళారులను పట్టుకోవటం ఇటు పోలీసులకూ తలనొప్పిగా మారుతోంది.
ప్రస్తుతం కోవిడ్ నిబంధనల దృష్ట్యా టీటీడీ టికెట్లను ఆన్‌లైన్ చేసింది. వచ్చే నెల దర్శనాల టికెట్ లను ముందు నెలలలోనే విడుదల చేస్తోంది. ఇప్పటి వరకూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్ లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఇవ్వగా...ఈనెల 26 నుంచి సర్వదర్శనాల టికెట్ లను ఆన్లైన్ లోనే అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించింది.
Also Read : ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక
కాబట్టి, శ్రీవారి దాతలుగా కాకుండా... టికెట్లు పొందాలకునే సాధారణ భక్తులకు ఆన్లైన్ లో టికెట్ లు బుక్ చేసుకోవటం ఒక్కటే ప్రస్తుతం ఉన్న మార్గం. కనుక దళారుల మాయమాటలు నమ్మి మోసపోకండి. tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కి లాగిన్ అయ్యి టికెట్స్ బుక్ చేసుకోండి. లేదా టీటీడీ వారి గోవిందా యాప్ నుంచి టికెట్లు బుక్ చేసుకొండి.
Also Read: 8 ఏళ్ల బాలికకి గట్టిగా ముద్దు పెట్టేసిన బాలుడు.. కారణం తెలిసి పోలీసుల దిమ్మతిరిగింది!
Also Read: పాపం.. ఆ బుడ్డోడి కుటుంబానికి మరో కష్టం.. నగదు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు