Tirumala News: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచో తెలుసా?
Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెలలోలో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వివరాలు తెలుసుకోండి
Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
వాహన సేవల వివరాలు :
- 4 అక్టోబర్ 2024: సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
- 5 అక్టోబర్ 2024: ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం సేవ ఉంటుంది.
- 6 అక్టోబర్ 2024: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంలో శ్రీనివాసుడు ఊరేగనున్నాడు.
- 7 అక్టోబర్ 2024: ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై దర్శనమియ్యనున్నాడు.
- 8 అక్టోబర్ 2024: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది. దీని కోసం తిరుమల దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
- 9 అక్టోబర్ 2024: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై అభయం ఇవ్వనున్న శ్రీనివాసుడు.
- 10 అక్టోబర్ 2024: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం ఉంటుంది.
- 11 అక్టోబర్ 2024: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ ఉంటుంది.
- 12 అక్టోబర్ 2024: ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ద్వాజావరోహణంతో వేడుకలు ముగుస్తాయి.
శ్రావణ ఉపకర్మ
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీ కృష్ణస్వామివారిని శ్రీ భూవరహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి, ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు.
వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
టికెట్ల దందాకు చెక్
తిరుమల ఏపి టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులును దర్శనానికి అనుమతిస్తూన్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. నిత్యం 30 నుంచి 40 మంది భక్తులును ఈ కోటాలో పంపిస్తున్నారు. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెంట్, టిటిడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏపి టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నారు. 5 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న తిరుమల పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Also Read:తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?