By: ABP Desam | Updated at : 14 Dec 2022 09:10 AM (IST)
తిరుమల క్షేత్రం
శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడికి ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అర్చకులు. ఇక బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన పాయసంను అర్చకులు స్వామి వారి నైవేద్యంగా మొదటి గంటలో సమర్పిస్తారు. మంగళవారం 13-12-2022 రోజున 63,214 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 23,147 మంది తలనీలాలు సమర్పించగా, 5.50 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 01 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 18 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు, సూచనల మేరకు టిటిడి రద్దు చేసింది. కేవలం ఏడాదికి ఓ మారు సర్కారు వారి సహస్రకళషాభిషేకం టిటిడి నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.
అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్రదీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. నిత్య సేవల్లోభాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకారసేవను నిర్వహించి, తిరుఉత్సవం నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సృవదర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. రాత్రి కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
Tirumala News: తిరుమల కొండపై వారం నుంచి ఆగని వర్షం - భక్తులు తీవ్ర ఇబ్బందులు
Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!
Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్ గడువు పొడిగింపు
Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు
Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ హాజరు
First Time MLAs In Telangana: ఈ ఎమ్మెల్యేలు స్పెషల్ వేరే లెవల్- ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
/body>