అన్వేషించండి

Tirumala Hundi Collection: కరోనా తర్వాత భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం!

Tirumala Hundi Collection: టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి హుండీ ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది. గత కొన్ని నెలలుగా వంద కోట్ల మార్కును దాటింది. 

Tirumala Hundi Collection: ఆపద్భాంధవుడు అనాథ రక్షకుడైన వేంకటేశ్వరుడి దర్శనార్ధం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇలా చేరుకున్న భక్తులు తమ కోరిన కోర్కెలు నెరవేరడంతో ముందుగా తలనీలాలు సమర్పించి, స్వామి వారిపై భక్తి భావంతో తమ స్ధోమతకు తగ్గట్టుగా కానుకలు సమర్పిస్తుంటారు. హుండీ ద్వారా మాత్రమే కాకుండా భారీ విరాళాలు, భూములు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, స్ధిరాస్తులు సైతం శ్రీవారికి కానుకగా అందిస్తుంటారు.

కరోనా సమయంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి దర్శనం భాగ్యం కల్పించింది టిటిడి. పూర్తి స్ధాయిలో కరోనా ఉపధృవం తగ్గడంతో భారీగా భక్తులు తిరుమల యాత్రకు క్యూ కడుతున్నారు. దీంతో ఏడుకొండలు ప్రతినిత్యం భక్త జన సంద్రంగా మారుతుంది. కిలోమీటర్ల మేర భక్తులు స్వామి వారి క్షణకాల దర్శన భాగ్యం కోసం గంటల తరబడి వేచి ఉండి స్వామి వారి ఆశీస్సులు పొంది ముడుపులు చెల్లించుకుంటున్నారు. ఇక కరోనా తర్వాత అంతకంతకూ శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే గత కొన్ని నెలలుగా నెలకు వంద కోట్ల మార్కును దాటి టీటీడీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కరోనా సమయంలో వార్షిక బడ్జెట్ అంచనాను చేరుకోలేకపోయిన టీటీడీ

ప్రతి ఏడాది భక్తుల సంఖ్యను అంచనా వేస్తూ టీటీడీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది. హుండీ ఆదాయం‌ బట్టి టీటీడీ బడ్జెట్ మారుస్తూ వస్తుంటుంది. ఇక ఎవరూ ఊహించని కరోనా ఉపద్రవం టీటీడీని అతలాకుతలం చేసింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఎనభై రోజులకుపైగా స్వామి వారి దర్శనంకు భక్తుల అనుమతిని రద్దు చేస్తూ ఏకాంతంగా స్వామి వారికి కైంకర్యాలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో భక్తుల రాక తగ్గడంతో కరోనా సమయంలో టీటీడీ వార్షిక బడ్జెట్ అంచనా చేరుకోలేక పోయింది. ప్రతి ఏడాది టీటీడీ వార్షిక బడ్జెట్ పెంచుతూ వస్తోంది. 2019-20 సంవత్సరంలో టీటీడీ వార్షిక బడ్జెట్ అంచనాను అందుకుంది. ముఖ్యంగా శ్రీవారికి హుండీ ద్వారా వ‌చ్చే ఆదాయంతోపాటుగా ద‌ర్శ‌న టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం, వ‌స‌తి గదులు, క‌ల్యాణ క‌ట్టలు, కళ్యాణ మండపాలు, వంటి ద్వారా టిటిడికి ఆదాయం చేకూరుతుంది. టీటీడీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం ల‌భించింది. అంటే నెల‌కు వంద కోట్ల‌కుపైగా ఆదాయం లెక్కన స‌గ‌టున రోజుకి రూ. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వస్తుంది.

13 వందల కోట్ల అంచనా..

ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను టీటీడీ రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా టీటీడీ పాలక మండలి సభ్యులు బడ్జెట్ ను సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేసింది టీటీడీ. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. ఇవన్నీ కరోనా రాక ముందు పద్దులు అయినప్పటికీ.. కరోనా సమయంలో ఎవరూ ఊహించని స్ధాయిలో టిటిడికి హుండీ ఆదాయం సమకూరింది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ ఉండడంతో 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా టీటీడీ అంచనాలను చేరుకోలేక పోయింది. ఏమాత్రం ఊహించని విధంగా కేవలం 721 కోట్లు రూపాయల ఆదాయం లభించింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం రివైజ్డ్ చేసి 2,553 కోట్లకు కుదించింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలు అంచనా వేసిన టీటీడీ, 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలకమండలి సభ్యులు ఆమోదించారు.

8 నెలల్లోనే వంద కోట్ల మార్కును దాటిన టీటీడీ

కరోనా నుంచి బయట పడిన తర్వాత క్రమేపి శ్రీనివాసుడి కరుణా కటాక్షాల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో స్వామి వారి దర్శన భాగ్యం కోసం రోజుల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏడు కొండల్లో భక్తుల సందడి నెలకొనడంతో క్రమేపి హుండీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే మార్చి మాసం నుంచి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 100 కోట్ల మార్క్ దాటి రావడంతో పాటుగా, వరుసగా 8 మాసాలు రూ. 100 కోట్ల మార్క్ ను దాటి టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. మార్చి మాసంలో 19,72,656 లక్షల మంది దర్శించుకుంటే, హుండీలో రూ. 128.61 కోట్ల రూపాయల నగదు కానుకలుగా సమర్పించారు. ఇక ఏప్రిల్ నెలలో 20,62,323 లక్షల మంది దర్శించుకుంటే, హుండీలో రూ. 127.63 కోట్లు కానుకలుగా సమర్పించారు. మే నెలలో 22.68 లక్షల మంది దర్శించుకుని రూ‌. 130.20 కోట్లు కానుకలుగా సమర్పించారు. జూన్ నెలలో 23,18,829 లక్షల మంది దర్శించుకుని  హుండీలో రూ.123.74 కోట్లు కానుకలుగా సమర్పించారు. 

1450 కోట్ల పైనే వచ్చే అవకాశం..

జూలై నెలలో 23,37,324 లక్షల మంది దర్శించుకుని హుండీలో రూ.139.46 కోట్లు కానుకలుగా సమర్పించారు. ఇక ఆగస్టు నెలలో 22,80,084 లక్షల మంది దర్శించుకుని రూ. 140.07 కోట్లు కానుకలను హుండీలో వేశారు. తిరుమల హుండీ ఆదాయం చరిత్రలోనే 140 కోట్ల మార్క్ దాటడం ఇదే ఇదే ప్రథమం. సెప్టెంబరు నెలలో 22.12 లక్షల మంది దర్శించుకుని హుండీలో రూ.122.19 కోట్లు కానుకలుగా సమర్పించారు. అక్టోబరులో హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు రూ.122.8 కోట్లు సమర్పించుకున్నారు. గత నెలలో 23వ తేదీ ఒక్కరోజే రూ. 6.31 కోట్లు హుండీ కానుకలు లభించాయి. ఇప్పటికే హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటిన మాసాలకు లెక్కలు వేసుకుంటే హుండీ ఆదాయం రూ. 1034.7 కోట్ల రూపాయలు దాటుతుంది. ఇక జరుగుతున్న నవంబర్ రాబోయే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలను అంచనా వేసుకుంటే మొత్తం 1450 కోట్ల రూపాయల పైన హుండీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక రోజు రోజుకి భక్తుల సంఖ్యతోపాటుగా, ఘననీయంగా పెరుగుతున్న హుండీ ఆదాయం రావడంతో రాబోవు ఏడాది బడ్జెట్ సైతం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి మాసంలో ప్రవేశ పెట్టె బడ్జెట్ రూ. 3500 కోట్లు పైగా ఉండే అవకాశం ఉందని టీటీడీ ఆర్ధిక నిపుణులు అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ కరోనా తర్వాత హుండీ ఆదాయం వంద కోట్ల మార్కును దాటుతూ రావడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Embed widget